OG : OG సినిమా ఇలాగే ఉండబోతుందా..?
OG : ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి “A” సర్టిఫికెట్ రావడం విశేషంగా మారింది. సాధారణంగా పవన్ సినిమాలకు “U” లేదా “U/A” సర్టిఫికెట్ వస్తాయి. కానీ ఈసారి సినిమాలో ఉన్న హింసాత్మక సన్నివేశాలు, తలలు నరికే సీన్స్, రక్తపాతం కారణంగా బోర్డు “A” ఇచ్చింది.
- By Sudheer Published Date - 04:00 PM, Wed - 24 September 25

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) – సుజీత్(Sujeeth) కలయికలో రూపొందిన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ‘ఓజీ’ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. గ్లింప్స్, ట్రైలర్‌తోనే సినిమాపై భారీ హైప్ క్రియేట్ కాగా, తమన్ అందించిన పాటలు చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి. ముఖ్యంగా పవన్ మాస్ లుక్, ఆయన యాక్షన్ డిజైన్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో *ఓజీ* పాన్‌ఇండియా స్థాయిలో ఒక భారీ హిట్‌గా నిలుస్తుందనే నమ్మకం అభిమానుల్లో కనిపిస్తోంది. ఈ సినిమాపై ఇప్పటివరకు బయటకు వచ్చిన ప్రతి అప్‌డేట్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూ, ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెంచుతోంది.
Fight Breaks : గ్రౌండ్ లో శృతిమించుతున్న పాక్ ఆటగాళ్ల తీరు..
ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి “A” సర్టిఫికెట్ రావడం విశేషంగా మారింది. సాధారణంగా పవన్ సినిమాలకు “U” లేదా “U/A” సర్టిఫికెట్ వస్తాయి. కానీ ఈసారి సినిమాలో ఉన్న హింసాత్మక సన్నివేశాలు, తలలు నరికే సీన్స్, రక్తపాతం కారణంగా బోర్డు “A” ఇచ్చింది. కొన్ని సన్నివేశాలు తొలగిస్తే “U/A” ఇవ్వడానికి సిద్ధమని బోర్డు సూచించినా, దర్శకుడు సుజీత్ తన విజన్‌లో మార్పు చేయడానికి అంగీకరించలేదు. ఫలితంగా పవన్ కెరీర్‌లోనే తొలిసారి సినిమా “A” సర్టిఫికెట్ పొందింది. ఇది అభిమానుల్లో మరింత కుతూహలాన్ని రేకెత్తిస్తోంది. అదనంగా ఈ సినిమాకు రన్‌టైమ్ 2 గంటలు 34 నిమిషాలుగా ఫిక్స్ కావడం మరో ప్లస్ పాయింట్. తక్కువ నిడివి, పేస్ ఫాస్ట్‌గా ఉండటం వల్ల కథ ఆసక్తికరంగా సాగుతుందన్న నమ్మకం కలుగుతోంది.
‘ఓజీ’ కథ విషయానికి వస్తే.. ముంబై నేపథ్యంలో గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా సుజీత్ తీర్చిదిద్దాడు. ఇమ్రాన్ హష్మీ పోషించిన ఓమీ అనే డాన్, ప్రకాశ్ రాజ్ చేసిన సత్యదాదాను అంతం చేయాలని ప్రయత్నిస్తాడు. ఆ సమయంలో ముంబైకి వచ్చే ఓజాస్ గంభీర (పవన్ కళ్యాణ్) ఎలా ఓమీని ఎదుర్కొన్నాడు? ఆయన ఎలాంటి యుద్ధం సాగించాడు? అనేదే కథనం. తమన్ అందించిన సంగీతం సినిమాకు ప్రాణం పోసింది. సుజీత్ గతంలో ‘సాహో’లో యాక్షన్‌ను ఎలా డిజైన్ చేశాడో ప్రేక్షకులు చూశారు. ఇప్పుడు పవన్ ఫ్యాన్‌గా ఆయనకు తగిన మాస్ ట్రీట్ ఇవ్వాలని డైరెక్టర్ పూర్తి స్థాయిలో కృషి చేశాడని తెలుస్తోంది. ఇప్పటికే ఏర్పడిన భారీ అంచనాలతో పాటు కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా సరే, ‘ఓజీ’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయం అని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.