NTR Devara : దేవరకు రికార్డ్ రేటు.. మైండ్ బ్లాక్ ఆఫర్..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న దేవర (NTR Devara) సినిమా సెట్స్ మీద ఉంది. 2024 ఏప్రిల్ 5న రిలీజ్ ఫిక్స్
- By Ramesh Published Date - 12:33 PM, Fri - 29 September 23

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న దేవర (NTR Devara) సినిమా సెట్స్ మీద ఉంది. 2024 ఏప్రిల్ 5న రిలీజ్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా రిలీజ్ టైం కి 7 నెలల గ్యాప్ ఉన్నా బిజినెస్ డీల్స్ వస్తున్నాయి. ముఖ్యంగా సినిమా ఓటీటీ రైట్స్ కోసం ప్రముఖ ఓటీటీ సంస్థలు పోటీ పడుతున్నాయి. వీరిలో అమేజాన్ ప్రైం, నెట్ ఫ్లిక్స్ ఉన్నట్టు తెలుస్తుంది.
దేవర సినిమాకు నెట్ ఫ్లిక్స్ భారీ ఆఫర్ ఇచ్చిందట. దాదాపు 200 కోట్లను డిజిటల్ రైట్స్ డీల్ కోసం ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది. డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కోసం ఈ ఆఫర్ ఇచ్చారా లేక ఆఫ్టర్ థియేట్రికల్ రిలీజ్ కోసమా అన్నది తెలియాల్సి ఉంది. RRR తర్వాత NTR క్రేజ్ గ్లోబల్ లెవెల్ లో విస్తరించింది. అందుకే నెట్ఫ్లిక్స్ తారక్ సినిమాకు ఫ్యాన్సీ రేటు టెంప్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
దేవర (Devara) బడ్జెట్ లో 70 శాతం ఓటీటీ రైట్స్ రూపం లో వచ్చేలా రికార్డ్ ప్రైజ్ వచ్చింది. అయితే నెట్ ఫ్లిక్స్ ఆఫర్ ని కూడా మేకర్స్ హోల్డ్ లో పెట్టినట్టు తెలుస్తుంది. ఓటీటీ రైట్స్ కే 200 కోట్లు అంటే థియేట్రికల్ రైట్స్ తో దేవర దుమ్ముదులిపేస్తాడని చెప్పొచ్చు. దేవర సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
ట్రిపుల్ ఆర్ లో కొమరం భీమ్ గా పాన్ ఇండియా ప్రేక్షకులను అలరించిన తారక్ ఈసారి దేవరగా అదరగొట్టబోతున్నాడు. సినిమా కోసం కొరటాల శివ ఎన్టీఆర్ ఇద్దరు ఓ రేంజ్ లో కష్టపడుతున్నట్టు తెలుస్తుంది. దేవర సినిమాతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర తన స్టామినా చూపించాలని ఫిక్స్ అయ్యాడు తారక్.
Also Read : Tollywood Star : యానిమల్ కథ తెలుగు స్టార్ హీరో కాదన్నాడా.. ఎవరతను..?