NTR : దేవర ఫ్యాన్స్ ని ఇబ్బంది పెడుతున్న అతను..?
దేవర నుంచి ఎలాంటి అప్డేట్స్ రావట్లేదని ఎన్.టి.ఆర్ (NTR Devara) ఫ్యాన్స్ అప్సెట్ లో ఉన్నారు. ఐతే ఈ పాటికి సినిమా నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ అవ్వాల్సి ఉన్నా కేవలం మ్యూజిక్
- By Ramesh Published Date - 11:35 PM, Tue - 23 July 24

NTR ఎన్.టి.ఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవర సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ ఫిక్స్ చేశారు. తారక్ ఫ్యాన్స్ అందరికీ మాస్ ట్రీట్ ఇచ్చేలా ఈ సినిమా వస్తుంది. కొరటాల శివ ఇదివరకు యాక్షన్ సినిమాలు చేశాడు కానీ ఈ సినిమా వేరే లెవెల్ లో ఉంటుందని తెలుస్తుంది. దేవర సినిమాలో ఎన్.టి.ఆర్ కు జతగా జాన్వి కపూర్ (Janhvi Kapoor) నటిస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేస్తున్నారు ఆడియన్స్.
దేవర నుంచి ఎలాంటి అప్డేట్స్ రావట్లేదని ఎన్.టి.ఆర్ (NTR Devara) ఫ్యాన్స్ అప్సెట్ లో ఉన్నారు. ఐతే ఈ పాటికి సినిమా నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ అవ్వాల్సి ఉన్నా కేవలం మ్యూజిక్ డైరెక్టర్ వల్లే లేట్ అవుతుందని టాక్. కోలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల అనిరుద్ దేవరకు టైం ఇవ్వలేకపోతున్నాడట. విషయం తెలిసినా సరే టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ని ఏమీ అనలేని పరిస్థితి.
Also Read : Nagarjuna : నాగార్జున వెబ్ సీరీస్ కి అడ్డు పడుతుంది ఎవరు..?
దేవర అప్డేట్స్ కోసం ఒక పక్క ఫ్యాన్స్ అంతా ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తుంటే మ్యూజిక్ విషయంలో అనిరుద్ అంత లేట్ చేస్తున్నాడట. అందుకే దేవర కు సరైన ప్రమోషనల్ కంటెంట్ ఇంకా అప్డేట్స్ కూడా ఇవ్వట్లేదని అంటున్నారు. ఐతే సినిమా మీద మాత్రం తారక్ సూపర్ కాన్ఫిడెంట్ గా ఉండగా ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ అంతా కాలర్ ఎగరేస్తారని హామీ ఇచ్చాడు.
ఆచార్య తర్వాత కొరటాల శివ (Koratala Siva) చేస్తున్న ఈ సినిమా తో మళ్లీ తిరిగి హిట్ ఫాం లోకి రావాలని చూస్తున్నాడు కొరటాల శివ. ఐతే ఎన్.టి.ఆర్ అతని మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తాడా లేదా అన్నది చూడాలి.
Also Read : Rashmika Mandanna : ఒకేరోజు రెండు సినిమాలు.. తనతో పోటీ పడుతున్న రష్మిక..!