HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >No Pawan Sharmila And Lokesh In Yatra 2

Yatra 2: ‘యాత్ర 2’లో పవన్ కళ్యాణ్, షర్మిల, నారా లోకేష్ పాత్రలు కనిపించవా!

  • Author : Balu J Date : 14-01-2024 - 5:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Yatra2
Yatra2

Yatra 2: ఈ ఏడాది సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతోన్న సినిమాల్లో ‘యాత్ర 2’ ఒకటి. రాజకీయాల్లో పోరాట పటిమతో తిరుగులేని ప్రజా నాయాకుడిగా ఎదిగిన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి తనయుడిగా ఇచ్చిన మాట కోసం ఆయన చేసిన అసాధారణ పాదయాత్ర రాజకీయాలను ఎలాంటి మలుపులు తిప్పాయనే కథాంశంతో ఈ చిత్రాన్ని దర్శకుడు మహి వి.రాఘవ్ తెరకెక్కిస్తున్నారు. ప్రజా సంక్షేమం కోసం తండ్రి ఆశయ సాధన కోసం వై.ఎస్.జగన్ చేసిన ప్రామిస్‌ను ఎలా నిలబెట్టుకున్నారనేది ఈ సినిమా ప్రధానాంశం.

‘యాత్ర 2’లోని ప్రధాన పాత్రలు గురించి ఇప్పటికే మేకర్స్ తెలియజేశారు. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి … వై.ఎస్.జగన్ పాత్రలో కోలీవుడ్ స్టార్ జీవా నటించారు. వై.ఎస్.భారతి రోల్‌లో కేతికా నారాయణన్, నారా చంద్రబాబు నాయుడు పాత్రలో మహేష్ మంజ్రేకర్, సోనియా గాంధీ పాత్రలో సుసాన్నె బెన్నెట్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్, నారా లోకేష్, వై.ఎస్.షర్మిల పాత్రల్లో ఎవరు నటించారనే దానిపై పలు రకాలుగా వార్తలు వైరల్ అయ్యాయి.

అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ‘యాత్ర 2’లో పవన్ కళ్యాణ్, నారా లోకేష్, వై.ఎస్.షర్మిల పాత్రలు ఉండవు. తండ్రి చేసిన వాగ్దానాన్ని నిలబెట్టటానికి జగన్ చేస్తున్న పోరాటం, తండ్రీ కొడుకుల మధ్య ఉన్న అనుబంధంలోని భావోద్వేగాన్ని ఆవిష్కరిస్తూ వై.ఎస్.జగన్ చేసిన పాదయాత్ర గురించి మాత్రమే ‘యాత్ర 2’ చిత్రాన్ని దర్శకుడు మహి వి.రాఘవ్ రూపొందించారు. పాత్రల మీద దృష్టి పెడితే తాను చెప్పాలనుకున్న ఎమోషనల్ పాయింట్‌ను చెప్పలేమని భావించిన డైరెక్టర్ ముందు నుంచి తన ప్రణాళిక ప్రకారం యాత్ర 2ను తెరకెక్కించినట్లు టాక్.

వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర ఆధారంగా ‘యాత్ర’ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 2009 నుంచి 2019 వరకు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర ఆధారంగా ‘యాత్ర 2’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన మూవీ టీజర్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచింది. మహి వి రాఘవ్ దర్శకత్వంలో త్రీ ఆట‌మ్ లీవ్స్‌, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా ‘యాత్ర 2’ను నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 8న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • latest tollywood news
  • nara lokesh
  • Pawan Kalyan
  • Yatra 2

Related News

Pawan Kalyan Adopts Two Gir

అంజనాదేవి పుట్టిన రోజు సందర్బంగా పవన్ దత్తత

తన తల్లి పుట్టినరోజును పురస్కరించుకుని, జూలోని రెండు జిరాఫీలను ఏడాది పాటు దత్తత తీసుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. కేవలం ప్రకటనతో సరిపెట్టకుండా, ఆ మూగజీవుల సంరక్షణకు మరియు ఆహార ఖర్చులకు అవసరమైన నిధులను తానే స్వయంగా భరిస్తానని వెల్లడించడం పర్యావరణ ప్రేమికులను ఆకర్షించింది

  • Chandrababu Family

    ఒక్కసారిగా పడిపోయిన హెరిటేజ్ షేర్లు.. చంద్రబాబు సతీమణికి రూ. 80 కోట్లకుపైగా లాస్!

  • Ajit Pawar Last Rites

    ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు..

  • Chandrababu Heritage Compan

    చంద్రబాబు హెరిటేజ్ కు షాక్

  • Pawan is a person who thinks about two or three generations: Nagababu

    నాగబాబు కు కీలక బాధ్యతలు అప్పగించిన కూటమి సర్కార్

Latest News

  • నేటితో ముగియనున్న మేడారం మహా జాతర

  • డిప్యూటీ సీఎం గా సునేత్ర పవర్ ! ఆమె కు కేటాయించే శాఖలివే !!

  • సిట్ నోటీసులపై కేసీఆర్ హైకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారా ?

  • భక్తులకు గుడ్ న్యూస్ – మేడారం జాతర లో గంగాజలం పంపిణి !!

  • ఐటీ దెబ్బకు రియల్ ఎస్టేట్ కంపెనీ ఛైర్మన్ ఆత్మహత్య!

Trending News

    • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

    • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

    • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

    • పీఎం కిసాన్ ప‌థ‌కం 22వ వాయిదా విడుదల ఎప్పుడంటే?!

    • ఇప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుందో తెలుసా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd