HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Nivetha Pethuraj Ventures Into Ott Space For Aha

Aha: నివేదా పేతురాజ్ ప్రధాన పాత్రలో  ‘బ్ల‌డీ మేరి’

100% తెలుగు ఓటీటీ మాధ్య‌మం ఆహా రోజు రోజుకీ గ‌ణ‌నీయంగా త‌న ప్ర‌భావాన్ని పెంచుకుంటూ తెలుగు వారికి హృద‌యాల్లో సుస్థిర‌మైన స్థానాన్ని ద‌క్కించుకుంది.

  • Author : Balu J Date : 08-02-2022 - 4:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Aha
Aha

100% తెలుగు ఓటీటీ మాధ్య‌మం ఆహా రోజు రోజుకీ గ‌ణ‌నీయంగా త‌న ప్ర‌భావాన్ని పెంచుకుంటూ తెలుగు వారికి హృద‌యాల్లో సుస్థిర‌మైన స్థానాన్ని ద‌క్కించుకుంది. 100% ఎంటైర్‌టైన్మెంట్‌ను అందిస్తామ‌నే మాట‌ను నిల‌బెట్టుకుంటూ వ‌స్తోన్న ఆహాలో ఇప్పుడు సీట్ ఎడ్జ్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ వెబ్ ఒరిజిల్ ‘బ్లడీ మేరి’ ప్రీమియర్‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. నివేదా పేతురాజ్ తెలుగు ఓటీటీ ఎంట్రీ ఇస్తున్నారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు చందు మొండేటి డిజిట‌ల్ మాధ్య‌మంలో తెర‌కెక్కించిన తొలి ఒరిజిన‌ల్ ఇది. ఈ వెబ్ ఒరిజిన‌ల్ నుంచి నివేదా పేతురాజ్ పాత్ర‌ను రివీల్ చేస్తూ ఫ‌స్ట్ లుక్‌ను సోమ‌వారం విడుద‌ల చేశారు.

ఈ ఫ‌స్ట్ లుక్‌ను గ‌మ‌నిస్తే ఇందులో నివేదా లుక్ భ‌య‌పెట్టేలా ఇన్‌టెన్స్‌తో ఉంది. ‘ఇఫ్ యువార్ బ్యాడ్, షి ఈజ్ బ్లడీ బ్యాడ్’ అనేది ట్యాగ్ లైన్‌. వైక‌ల్యంతో ఇబ్బంది ప‌డుతున్న‌ప్ప‌టికీ త‌న స‌మ‌స్య‌ల‌ను ధైర్యంగా ఎదుర్కొన‌గ‌లిగే అమ్మాయిగా ఇందులో నివేదా న‌టించారు. ఆమెను ప్రేమించిన వారి కోసం ఎంత‌టి స‌మ‌స్య‌నైనా ఎదుర్కొన‌గ‌లిగే అమ్మాయే మేరి. కిరిటీ దామ‌రాజు, రాజ్ కుమార్ క‌సిరెడ్డి, బ్ర‌హ్మాజీ, అజ‌య్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్ (సై ఫై థ్రిల్ల‌ర్ కుడి ఎడ‌మైతేను రూపొందించిన నిర్మాత‌) ఈ చిత్రాన్ని నిర్మించారు కార్తికేయ వంటి థ్రిల్ల‌ర్ జోన‌ర్‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన ద‌ర్శ‌కుడు చందు మొండేటి ఈ మూవీని డైరెక్ట‌ర్ చేశారు. కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని సినిమాటోగ్రాఫ‌ర్‌. కాల భైర‌వ సంగీతాన్ని అందించారు. త్వరలోనే బ్లడీ మేరి ఆహా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.

అర్జున ఫ‌ల్గుణ‌, హే జూడ్‌, ది అమెరిక‌న్ డ్రీమ్‌, ల‌క్ష్య, సేనాప‌తి, త్రీ రోజెస్‌, లాభం, మంచి రోజులొచ్చాయి, రొమాంటిక్‌, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌, అనుభ‌వించు రాజా, స‌ర్కార్‌, ఛెఫ్ మంత్ర‌, అల్లుడుగారు, క్రిస్‌మ‌స్ తాత వంటివ‌న్నీ ప్ర‌స్తుతం ఆహాలో ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందుతున్న‌వే. శ్రీరామ్‌చంద్ర హోస్ట్ చేస్తున్న ఫ‌స్ట్ ఎవ‌ర్ సౌత్ ఇండియాస్ ఇండియ‌న్ ఐడ‌ల్‌… అదే మ‌న తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ త్వ‌ర‌లోనే ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. ప్ర‌స్తుతం నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాప‌బుల్ షోను ఐఎండీబీ నెంబ‌ర్ ఒన్ టాక్ షో గా గుర్తించిన విష‌యం తెలిసిందే.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • aha
  • Nivetha Pethuraj
  • ott
  • web series

Related News

Center alerts to OTT

OTT : OTT ప్రేక్షకులకు ఈ వారం పండగే !!

డిజిటల్ వినోదాన్ని కోరుకునే ప్రేక్షకులకు ఈ వారం సరికొత్త పండగ వాతావరణం నెలకొంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు వరుసగా క్రేజీ సినిమాల స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి

    Latest News

    • Kerosene : మళ్లీ కిరోసిన్ సరఫరా!

    • Rain : వందల ఏళ్లుగా అక్కడ వర్షం పడడం లేదట !!

    • Kumari Aunty : బిజినెస్ లేదంటూ కుమారీ ఆంటీ ఆవేదన

    • Rashmika : తెలంగాణ కొత్త కోడలు కు కోపం వచ్చిందే !!

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    Trending News

      • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

      • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

      • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

      • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

      • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd