HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Nidhi Agarwal Comments On Pawan Kalyan

పవన్ కళ్యాణ్ పై ప్రభాస్ హీరోయిన్ జోస్యం ! షాక్ లో ఫ్యాన్స్

పవన్ కళ్యాణ్ సరసన 'హరిహర వీరమల్లు' చిత్రంలో నటించిన నిధి అగర్వాల్ తాజాగా ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. పవన్ కళ్యాణ్ కేవలం ఒక నాయకుడే కాదు, భవిష్యత్తులో

  • Author : Sudheer Date : 21-01-2026 - 1:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan Kalyan
Pawan Kalyan

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పాతికేళ్ల ప్రయాణమే లక్ష్యంగా జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్, ప్రస్తుతం అటు రాష్ట్రంలో సీఎం చంద్రబాబుకు, ఇటు కేంద్రంలో ప్రధాని మోడీకి అత్యంత నమ్మకస్తుడైన మిత్రుడిగా ఎదిగారు. గతంలో తాను అభిమానించిన చెగువేరా విప్లవ భావజాలం, కమ్యూనిస్టు సిద్ధాంతాల నుండి క్రమంగా సనాతన ధర్మం వైపు మళ్లడం ఆయన రాజకీయ శైలిలో వచ్చిన అతిపెద్ద మార్పుగా కనిపిస్తోంది. ఈ పరిణామం ఆయనకు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపును, ఆదరణను తెచ్చిపెట్టింది. ఈ క్రమంలోనే ఆయనతో కలిసి పనిచేసిన సినీ ప్రముఖులు కూడా పవన్ వ్యక్తిత్వంపై ప్రశంసలు కురిపిస్తుండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది.

Pawan Nidhi

Pawan Nidhi

ఇక పవన్ కళ్యాణ్ సరసన ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో నటించిన నిధి అగర్వాల్ తాజాగా ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. పవన్ కళ్యాణ్ కేవలం ఒక నాయకుడే కాదు, భవిష్యత్తులో ఆయన భారత ప్రధాని అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని ఆమె వ్యాఖ్యానించారు. ఆయనలోని ధైర్యం, చిత్తశుద్ధి చూస్తుంటే అది అసాధ్యమేమీ కాదని ఆమె అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో ఆయన చూపిస్తున్న నిబద్ధత, ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమను చూసి తాను ఫిదా అయ్యానని, ఆయన ఒక గొప్ప దూరదృష్టి కలిగిన నేత అని నిధి ప్రశంసల జల్లు కురిపించారు.

షూటింగ్ సమయంలో తనకు ఎదురైన అనుభవాలను పంచుకుంటూ, పవన్ కళ్యాణ్‌ను అభిమానులు ఒక సామాన్య నటుడిలా కాకుండా ఒక దైవంలా కొలుస్తారని నిధి గుర్తుచేసుకున్నారు. “తమ దేవుడితో కలిసి నటించేటప్పుడు చాలా మంది నన్ను అభినందించేవారు, అప్పుడే ఆయనకు ఉన్న క్రేజ్ ఏంటో నాకు అర్థమైంది” అని ఆమె తెలిపారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం చాలా ప్రత్యేకమైనదని, ఆయనతో కలిసి పనిచేయడం ఒక గౌరవంగా భావిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం నిధి చేసిన ఈ వ్యాఖ్యల వీడియో జనసైనికుల్లో జోష్ నింపుతూ నెట్టింట వైరల్ అవుతోంది.

పవన్ కల్యాణ్ ప్రధాని అవుతారు: నిధి అగర్వాల్

టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ పవన్ కల్యాణ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. పవన్ కళ్యాణ్ గొప్ప ధైర్యవంతుడైన నాయకుడని, భవిష్యత్తులో ఆయన ప్రధాని అయినా ఆశ్చర్యపోనవసరం లేదని పేర్కొన్నారు. pic.twitter.com/uQAPlj0lPr

— ChotaNews App (@ChotaNewsApp) January 21, 2026


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Nidhi Agarwal
  • nidhi agarwal comments on Pawan
  • Pawan Kalyan
  • pawan modi
  • Pawan pm
  • raajasaab
  • భవిష్యత్తులో

Related News

Ustad Bhagat Singh Ccensor

Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీంకు సెన్సార్ షాక్

సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ఎటువంటి కట్స్ లేకుండా 'యూ/ఏ' (U/A) సర్టిఫికెట్‌ను జారీ చేసింది. సినిమా రన్ టైమ్‌ను 2 గంటల 34 నిమిషాలుగా ఖరారు చేశారు. అయితే, పవన్ కళ్యాణ్ సినిమా అంటే చిన్న

  • Megamument

    Allu Sirish Wedding : అటు చిరు..ఇటు చరణ్ మధ్యలో పవన్ ! వాటే మెగా మూమెంట్ !!

  • Chiru Anna

    Viral : అల్లు శిరీష్ పెళ్లి లో అరుదైన ఘటన..చిరంజీవి కామెడీ కి పడీపడీ నవ్విన పవన్ భార్య అన్నా లెజివోనా

Latest News

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

  • TALRadio : ఈ రేడియో ఆన్ చేస్తే అన్ని మంచి వార్తలే! !

  • Big Shock : యూజర్లకు బిగ్ షాక్.. మొబైల్ డేటాపై ట్యాక్స్ వేయబోతున్న కేంద్రం ?

  • Gas Shortage : రైల్ ప్రయాణికులకు LPG షాక్

  • Velugumatla Demolition : కూల్చడం ఎందుకు..? మళ్లీ ఇల్లు కట్టించుడు ఎందుకు..? భూదాన్ ఘటన పై కేటీఆర్ ఫైర్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd