Hi Nanna Promotions : ఎన్నికల ప్రచారాన్ని గట్టిగా వాడుకుంటున్న నేచురల్ స్టార్ నాని
ప్రెస్ మీట్లలో సీఎం కేసీఆర్ మేనరిజమ్స్, సంభాషణా శైలిని అనుకరిస్తూ నాని తన సినిమాను ప్రమోట్ చేశారు
- By Sudheer Published Date - 01:35 PM, Tue - 21 November 23
ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల (TS Polls) ఫీవర్ నడుస్తోంది. రాజకీయ పార్టీలు తమకంటే తమకే ఓటు వేయాలని, ప్రత్యర్థులను తిడుతూ, తమను గెలిపిస్తే ఏం చేస్తామో చెబుతూ హామీలు ఇస్తున్నారు. దీంతో ఎన్నికలను ప్రతి ఒక్కరు గట్టిగా వాడుకుంటున్నారు. రాజకీయ పార్టీల అభ్యర్థులు విజయం కోసం తహతలాడుతుంటే..ఓటర్లు దొరికిందే ఛాన్స్ అన్నట్లు అభ్యర్థులను గట్టిగా డిమాండ్ చేస్తూ వారి కోర్కెలు తీర్చుకుంటున్నారు. ఇక సినీ స్టార్స్ సైతం ఎన్నికలను వారి సినిమాల కోసం వాడుకుంటున్నారు. ఇక నేచురల్ స్టార్ నాని (Natural Star Nani ) అయితే తన కొత్త సినిమా హాయ్ నాన్న (HI Nanna) కోసం బాగా వాడుకుంటున్నారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ (Rahul), సీఎం కేసీఆర్ (KCR) లను ఇమిటేట్ చేస్తూ పొలిటికల్ కార్యకర్తలనే కాక అభిమానులను , సినీ లవర్స్ ను ఆకట్టుకుంటున్నారు.
దసరా (Dasara) వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత నాని హీరోగా చేస్తున్న సినిమా హాయ్ నాన్న. ఇందులో నానికి జోడీగా సీతారామం బ్యూటి మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. వైరా ఎంటర్టైన్మెంట్స్పై మోహన్ చెరుకూరి (సీవీఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మాతలుగా నిర్మిస్తున్నారు. హాయ్ నాన్న మూవీతో శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా డిసెంబర్ 7న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ తరుణంలో గత కొద్దీ రోజులుగా సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో నాని బిజీ గా ఉన్నాడు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల వేడి నడుస్తుండడం తో..ఈ వేడి తన సినిమా ప్రమోషన్ కు వాడుకుంటూ వార్తల్లో నిలుస్తున్నాడు.
తాజాగా విడుదల చేసిన వీడియోలో ప్రెస్ మీట్లలో సీఎం కేసీఆర్ మేనరిజమ్స్, సంభాషణా శైలిని అనుకరిస్తూ నాని తన సినిమాను ప్రమోట్ చేశారు. విలేకరి రాహుల్ ప్రస్తావన తెస్తూ నాని చేసిన వీడియో జనాలను ఆకట్టుకుంటోంది.
ఏంది వా.. రాహుల్..అంటూ మొదలెట్టిన నానీ కేసీఆర్ను ఇమిటేట్ చేస్తూ సినిమా వివరాలన్నీ చెప్పేశాడు. పంచాతి పెట్టొద్దని, సినిమా పోస్ట్ పోన్ కాదని, డిసెంబర్ 7న దావత్ చేసుకోవాలని చెప్పాడు. ప్రీ ప్రోన్కు పోస్ట్ పోన్కు తేడా తెలవకపోతే ఎలా? అంటూ మరో పంచ్ వేశాడు. దీంతో, నానీ ప్రెస్ మీట్ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
ఊరికే
Press meet పెట్టా 😬#HiNanna #HiNannaOnDec7th pic.twitter.com/bZIQroHN5P
— Nani (@NameisNani) November 20, 2023
Read Also : Plane In Ocean : సముద్రంలో తేలిన రూ.1200 కోట్ల విమానం
Related News
Lok Polls : సింగరేణిని ముంచేందుకు రేవంత్ కుట్రలు – కేసీఆర్
మంచిగ ఉన్న సింగరేణిని ఒకప్పుడు ముంచిన కాంగ్రెస్ .. ఇప్పుడు మరోసారి మోడీతో కలిసి రేవంత్ రెడ్డి సింగరేణిని ముంచేందుకు కుట్రలు పన్నుతున్నారని పేర్కొన్నారు