Natu Natu: సోషల్ మీడియాని ఓ ఊపు ఊపేస్తున్న నాటు నాటు వీణ వెర్షన్.. వైరల్!
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్,జూనియర్ ఎన్టీఆర్ లో హీరోలుగా నటించిన విషయం తెలిసిందే.
- By Nakshatra Published Date - 07:50 PM, Wed - 15 March 23

Natu Natu: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్,జూనియర్ ఎన్టీఆర్ లో హీరోలుగా నటించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భాషల్లో విడుదల అయ్యి సంచలన విజయాన్ని అందుకుంది ఈ సినిమా. కాగా గత రెండు మూడు వారాలుగా ఈ సినిమా పేరు సోషల్ మీడియాలో మారుమోగుతున్న విషయం తెలిసిందే. అందుకు కారణం కూడా లేకపోలేదు. ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాటు ఆస్కార్ కు ఎంపిక అవ్వడంతో పాటు ఆస్కార్ అవార్డుని కూడా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
దీంతో దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు సినీ ప్రేక్షకులు చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురిపించడంతో పాటు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా ఈ నాటు నాటు సాంగ్ విడుదల అయిన తర్వాత సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ ఆ పాటలకు స్టెప్పులను వేస్తూ రీల్స్ చేసి ఎన్నో వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో నాటు నాటు సాంగ్ వీణా వెర్షన్ ని అద్భుతంగా ప్లే చేశారు. వివరాల్లోకి వెళితే.. వీణా ఆర్టిస్ట్ శ్రీవాణి నాటు నాటు పాటని వీణ వెర్షన్ లో ప్లే చేసి అందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఆ వీడియోని ఆర్ఆర్ఆర్ బృందానికి డెడికేట్ చేస్తూ శుభాకాంక్షలు కూడా తెలిపింది. ప్రస్తుతం ఆ వీడియో కాస్త సోషల్ వైరల్‌గా మారడంతో ఆ వీడియోని చూసిన చెర్రీ, తారక్ అభిమానులు కామెంట్ల వర్షం కురిపించడంతోపాటు ఆ వీడియోని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. అలాగే నాటు నాటు పాటని అంత అద్భుతంగా ప్లే చేసిన శ్రీ వాణిపై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.

Related News

Samantha Shaakuntalam: ఎన్టీఆర్ స్పూర్తి.. సమంత కోసం 14 కోట్ల బంగారం
టాలీవుడ్ లో భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గుణశేఖర్.