Pawan Kalyan Comments : మూర్తి గారు అప్పుడు మీ నోరు ఏమైంది..?
Pawan Kalyan Comments : జగన్ హయాంలో పవన్ కళ్యాణ్ సినిమాలపై ప్రభుత్వం కక్షగట్టిందని, విడుదల సమయంలో టికెట్ రేట్లు తగ్గించి, థియేటర్లను మూసివేయడంపై నారాయణమూర్తి ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు
- By Sudheer Published Date - 03:18 PM, Sun - 1 June 25

సీనియర్ నటుడు, దర్శకుడు ఆర్. నారాయణమూర్తి (R. Narayana Murthy) తన నిజాయితీ..ముక్కుసూటి తనంతో ప్రజల్లో మంచి గుర్తింపు పొందారు. రాజకీయాలపై పక్షపాతం లేకుండా మాట్లాడేవారని ఎంతోమంది అభిప్రాయం. కానీ ఇటీవల ఆయన మారిపోయినట్టుగా కనిపిస్తోంది. తాజాగా ఆయన పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేయడం వల్ల మూర్తి పై అభిమానులు , చిత్రసీమలో కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
HHVM : సమయం లేదు ట్రైలర్ లేదు…ఏంటి వీరమల్లు ఈ ఆలస్యం
ముఖ్యంగా నారాయణమూర్తి వ్యాఖ్యలపై నిర్మాత నట్టికుమార్ (Nattikumar) తీవ్రంగా స్పందించారు. జగన్ హయాంలో పవన్ కళ్యాణ్ సినిమాలపై ప్రభుత్వం కక్షగట్టిందని, విడుదల సమయంలో టికెట్ రేట్లు తగ్గించి, థియేటర్లను మూసివేయడంపై నారాయణమూర్తి ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. అప్పట్లో ఎంఆర్ఒలను థియేటర్ల వద్దకు పంపించి అత్యల్ప ధరలకే టికెట్లు అమ్మించిన సందర్భాలు గుర్తు చేస్తూ, అప్పుడు అన్యాయం అనిపించలేదా? అని నిలదీశారు. భీమ్లా నాయక్ రిలీజ్ టైంలో 130కి పైగా థియేటర్లు మూయించారని ఆరోపించారు. ఇప్పుడు మాత్రం పవన్ కల్యాణ్ అధికారులతో తనిఖీలు చేయించడాన్ని తప్పుగా చిత్రీకరించడం ఏమిటని ప్రశ్నించారు. గతంలో జరిగిన అన్యాయాలపై మౌనంగా ఉండి, ఇప్పుడు మాత్రం పవన్‌ను టార్గెట్ చేయడం వెనుక కారణాలు ఏంటి అని ప్రశ్నిచారు. థియేటర్లలో పాప్ కార్న్ ధరలు రూ.300కు పెరగడం, మెయింటెనెన్స్ లేకపోవడం వంటి అంశాలపై పవన్ స్పందించడాన్ని సమర్థించాల్సిన సమయంలో విమర్శించడం తగదని వ్యాఖ్యానించారు.