AAY Movie : అక్కినేని పాటని సైలెంట్‌గా రీమేక్ చేసేసిన ఎన్టీఆర్ బామ్మర్ది.. ఆయ్..!
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ తన కొత్త సినిమా కోసం అక్కినేని పాటని సైలెంట్‌గా రీమేక్ చేసేసాడు.
- By News Desk Published Date - 04:55 PM, Sat - 25 May 24

AAY Movie : ‘మ్యాడ్’ సినిమాతో ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ హీరోగా ఆడియన్స్ కి పరిచయమైన సంగతి తెలిసిందే. మొదటి సినిమాతో మంచి విజయం అందుకున్న నితిన్.. ఇప్పుడు రెండో సినిమాని సిద్ధం చేస్తున్నారు. గోదావరి నేపథ్యంతో ‘ఆయ్’ అనే కామెడీ ఎంటర్టైనర్ ని తీసుకురాబోతున్నారు. గీతాఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు అంజి కంచిపల్లి డైరెక్ట్ చేస్తున్నారు.
ఒక పక్క శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటూ వస్తున్న చిత్ర యూనిట్.. మరోపక్క ప్రమోషన్స్ తో మూవీని ఆడియన్స్ లోకి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈక్రమంలోనే ఫస్ట్ లుక్ పోస్టర్స్, సాంగ్స్ అంటూ సందడి చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి మొదటి సాంగ్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేసారు. ‘రంగనాయకి’ అనే సాంగ్ ని నేడు రిలీజ్ చేసారు. రామ్ మిరియాల ఈ పాటకి సంగీతం అందించగా సురేష్ బనిశెట్టి లిరిక్స్ రాసారు. అనురాగ్ కులకర్ణి పాటని పాడారు.
కాగా ఈ పాట రిలీజైన తరువాత ఒక విషయం బయటపడింది. అక్కినేని నాగేశ్వరరావు సూపర్ హిట్ మూవీ ‘అందాల రాముడు’లోని ‘రాముడేమన్నాడే..సీతా రాముడేమన్నాడే’ అనే సాంగ్ ని రీమేక్ చేస్తూ ఈ రంగనాయకి సాంగ్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. అయితే కేవలం ట్యూన్ మాత్రమే తీసుకోని లిరిక్స్ ని మాత్రం మార్చి రాసారు. మరి ఈ రీమేక్ ని అఫీషియల్ గా చేసారో, లేదా అన్ అఫీషియల్‌గా చేసారో తెలియాలి. అసలే ఇటీవలే కాపీ రైట్స్ కేసులు ఎక్కువ అయ్యాయి. కాగా అక్కినేని పాటకి కెవి మహదేవన్ సంగీతం అందించారు.