Natural Star Nani : ఛాన్స్ ఇచ్చిన నాని..షాక్ లో హీరోయిన్
Natural Star Nani : ‘తెలుసు కదా’ అనే సినిమాలో కథానాయికగా నటిస్తున్న సమయంలో జరిగిన ముహూర్త వేడుకలో నాని ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. అక్కడే శ్రీనిధిని చూసిన నాని, ఆమె తన పక్కన మంచి జోడీ అవుతుందని భావించి
- By Sudheer Published Date - 03:48 PM, Thu - 24 April 25

టాలీవుడ్‌లో కొత్తవాళ్లను ప్రోత్సహించే హీరోలలో నాని (Nani) ఒకడిగా మంచి గుర్తింపు పొందాడు. దర్శకులు, నటీనటులు, సాంకేతిక నిపుణులుఅందరిలోనూ కొత్త టాలెంట్‌ను వెతికి వారి కెరీర్‌కు అద్భుతమైన ఆరంభం కల్పించడంలో నాని ముందు వరుసలో ఉంటాడు. తాజాగా అతను నటిస్తున్న సినిమా ‘హిట్-3’ లో కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty ) హీరోయిన్‌గా ఎంపిక కావడం ఈ విషయాన్ని మరోసారి నిరూపిస్తోంది. కేజీఎఫ్ సినిమాతో పాపులర్ అయిన శ్రీనిధి, తెలుగులో నటిస్తున్న తొలి ప్రధాన సినిమానే ఇది కావడం విశేషం.
Maoists Hunting: 300 మంది మావోయిస్టుల దిగ్బంధం.. 5వేల మందితో భారీ ఆపరేషన్
ఓ ఇంటర్వ్యూలో శ్రీనిధి మాట్లాడుతూ… ‘హిట్ 3’ (HIT3)కోసం ఎంపిక చేసింది డైరెక్టర్ శైలేష్ కొలను కాదు, నానినే అని తెలిపింది. ‘తెలుసు కదా’ అనే సినిమాలో కథానాయికగా నటిస్తున్న సమయంలో జరిగిన ముహూర్త వేడుకలో నాని ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. అక్కడే శ్రీనిధిని చూసిన నాని, ఆమె తన పక్కన మంచి జోడీ అవుతుందని భావించి, ‘హిట్ 3’ లో నాయికగా అవకాశం ఇచ్చినట్టు ఆమె వెల్లడించింది. అనుకోకుండా వచ్చిన ఈ అవకాశాన్ని శ్రీనిధి నిజమైన లైఫ్‌టైం బ్రేక్‌గా భావిస్తోంది.
‘హిట్ 3’ హిట్ కాంబినేషన్‌లో వస్తున్న మూడవ చిత్రం. మే 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం శ్రీనిధికి మంచి బ్రేక్ ఇవ్వబోతుందని అంత నమ్ముతున్నారు. చూద్దాం ఏంజరుగుతుందో..!!