Nani Srikanth Odela 2 : నాని శ్రీకాంత్ ఓదెల 2.. ఇంట్రెస్టింగ్ గా మరో టైటిల్..!
Nani Srikanth Odela 2 తొలి సినిమా దర్శకుడైనా శ్రీకాంత్ టేకింగ్ కి తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఇక నానిలో ఊర మాస్ యాటిట్యూడ్ ని దసరా బయట పెట్టింది. నాని కేవలం క్లాస్ హీరో మాత్రమే
- By Ramesh Published Date - 09:40 AM, Fri - 8 November 24

Nani Srikanth Odela 2 న్యాచురల్ స్టార్ నాని (Nani) శ్రీకాంత్ ఓదెల కాంబోలో వచ్చిన దసరా సినిమా ఎంత సంచలన విజయం అనుకుందో తెలిసిందే. తొలి సినిమా దర్శకుడైనా శ్రీకాంత్ టేకింగ్ కి తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఇక నానిలో ఊర మాస్ యాటిట్యూడ్ ని దసరా బయట పెట్టింది. నాని కేవలం క్లాస్ హీరో మాత్రమే అన్న ట్యాగ్ లైన్ ని తీసేసేలా చేసిన సినిమా దసరా.
ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో నాని శ్రీకాంత్ ఓదెల కలిసి మరో సినిమాకు రెడీ అయ్యారు. ఈసారి వీరి కాంబో సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని టాక్. ఇప్పటికే నాని ఒక అవార్డ్ ఫంక్షన్ లో నెక్స్ట్ ఇయర్ శ్రీకాంత్ (Srikanth Odela) షర్ట్ మీద ఉన్న ఈ కాకి అన్ని అవార్డులను ఎత్తుకెళ్లిపోతుందని చెప్పాడు. సో ఇద్దరు కలిసి మరో భారీ సినిమానే చేయబోతున్నారని అర్ధమవుతుంది.
నాయుడి గారి తాలూఖా..
నాని ప్రస్తుతం శైలేష్ కొలను డైరెక్షన్ లో హిట్ 3 (Hit 3) సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే శ్రీకాంత్ ఓదెల సినిమాకు డేట్స్ ఇవ్వనున్నాడు. ఇక ఈ సినిమాకు టైటిల్ గా అంతకుముందు నాయుడి గారి తాలూఖా అనే పేరు వినిపించింది. ఐతే పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేయాలని చూస్తున్న ఈ ప్రాజెక్ట్ కి టైటిల్ గా కొత్తగా పారడైస్ (Paradise) అని పెట్టబోతున్నారట.
పారడైస్ అనే సినిమా ఆస్కార్ అవార్డ్ కూడా అందుకుంది. ఇప్పుడు అలాంటి టైటిల్ నే తమ సినిమాకు పెట్టాలని చూస్తున్నారు. మరి నాని శ్రీకాంత్ ఓదెల కాంబో టైటిల్ అదేనా లేదా అన్నది త్వరలోనే తెలుస్తుంది.
Also Read : Thalapathi Vijay : దళపతి విజయ్ నెక్స్ట్ సినిమా డైరెక్టర్ అతనేనా..?