Nagarjuna: Zee5లో గాలివాన ట్రైలర్ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఇప్పుడంతా ఓటీటీల కాలం నడుస్తోంది. దీంతో వెబ్ సీరిస్ లు జోరందుకుంటున్నాయి.
- By Hashtag U Published Date - 05:13 PM, Fri - 1 April 22
ఇప్పుడంతా ఓటీటీల కాలం నడుస్తోంది. దీంతో వెబ్ సీరిస్ లు జోరందుకుంటున్నాయి. గతంలో ఒకటి రెండు తప్పా పెద్దగా ఓటీటీలు ఉండేవి కావు. ఇప్పుడు పదుల సంఖ్యలో ఓటీటీలు ప్రేక్షకులకు కొత్త కంటెంట్ ను అందిస్తున్నాయి. లేటెస్టుగా రాధికా శరత్ కుమార్, సాయికుమార్ ప్రధానపాత్రధారులుగా నిర్మితమైన వెబ్ సిరీస్ గాలివాన. ఇది జీ5 ఓటీటీలో ఏప్రిల్ 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది. లేటెస్టుగా గాలివాన వెబ్ సిరీస్ ట్రైలర్ ను అక్కినేని నాగార్జున చేతుల మీదుగా గురువారం అధికారికంగా రిలీజ్ అయ్యింది. 1:39 నిమిషాల నిడివి ఉన్న ఆ ట్రైలర్ వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ట్రైలర్ లోని కంటెంట్ ను చూస్తే…ఫ్యామిలీ ఎమోషన్స్ తోపాటు సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ గా అనిపిస్తుంది. రాధిక సెంటిమెంట్ డైలాగ్స్ , హై ఎమోష్ తో చెప్పిన ఓ డైలాగ్ సీరిస్ లో ప్రతీకారం అనే పాయింట్ కూడా బలంగా ఉందనే చెప్పాలి.
ఇక క్వాలిటీ, విజువల్స్ పరంగా భారీతనం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. గతంలో కొన్ని క్రైమ్ థ్రిల్లర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ…ఇందులో మాత్రం తల్లి సెంటిమెంట్ తో కూడిన క్రైం థ్రిల్లింగ్ అంశాలు ప్రేక్షకులను ఎమోషనల్ గా ఆకట్టుకునేలా ఉన్నాయని చెప్పాలి. సాయికుమార్ క్యారెక్టర్ కూడా ఎమోషన్ తోపాటు ఫ్యామిలీ బాండింగ్ కు ఉన్న విలువను చూపిస్తోంది. ఈ వెబ్ సిరీస్ కు శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించగా..బీబీసీ స్టూడియోస్, నార్త్ స్టార్ బ్యానర్లపై సమీర్ గోగాటే, శరత్ మరార్ నిర్మించారు.
Related News
Nidhhi Agerwal: నిధి అగర్వాల్ కెరీర్ ట్రాక్ లో పడేనా.. ?
Nidhhi Agerwal: నిధి అగర్వాల్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్, ప్రభాస్ లతో ‘హరి హర వీరమల్లు’, ‘రాజాసాబ్’ చిత్రాల్లో నటిస్తోంది. ఈ ఇద్దరు హీరోలతో నిధికి టాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. నిధి బ్యాడ్ టైం ఎదుర్కొంటోందని, ఇప్పుడు ఆమె తన కెరీర్‌ను తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పీరియాడిక్ డ్రామాలో పవన్ కు ప్రేమికురాలిగా నటిస్తుండటంతో హరి హర వీరమల్�