Thandel : తండేల్ నాన్ థియేట్రికల్ బిజినెస్ డీటైల్స్..!
Thandel ఫిబ్రవరి 7న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా బిజినెస్ విషయంలో కూడా అదరగొడుతుందని తెలుస్తుంది. ఇక తండేల్ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్
- By Ramesh Published Date - 10:55 PM, Mon - 3 February 25

Thandel : నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో వస్తున్న సినిమ్నా తండేల్. ఈ సినిమాను చందు మొండేటి డైరెక్ట్ చేశారు. సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించగా సినిమా నుంచి వచ్చిన 3 సాంగ్స్ ఇప్పటికే చార్ట్ బస్టర్ గా నిలిచాయి. ఈ సినిమా విషయంలో అక్కినేని ఫ్యాన్స్ అంతా కూడా సూపర్ హ్యాపీగా ఉన్నారు.
సినిమా ట్రైలర్ కూడా అంచనాలు పెంచేసింది. ఇక ఫిబ్రవరి 7న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా బిజినెస్ విషయంలో కూడా అదరగొడుతుందని తెలుస్తుంది. ఇక తండేల్ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ లో కూడా నాగ చైతన్య కెరీర్ బెస్ట్ అందుకుంది. సినిమా ఓటీటీ రైట్స్ నెట్ ఫ్లిక్స్ ఏకంగా 35 కోట్లకు కొనేసిందని తెలుస్తుంది.
ఇక ఆడియో రైట్స్ రూపంలో 7 కోట్లు దాకా పలికిందని తెలుస్తుంది. హిందీ రైట్స్ మరో 8 కోట్లు దాకా వచ్చాయని తెలుస్తుంది. ఇక శాటిలైట్ రూపంలో 10 కోట్లు వచ్చాయట. సో టోటల్ గా నాన్ థియేట్రికల్ తోనే తండేల్ కి 60 కోట్ల దాకా వచ్చాయని తెలుస్తుంది. ఇక థియేట్రికల్ బిజినెస్ 30 కోట్లు కాగా అది వర్క్ అవుట్ అయితే మాత్రం నిర్మాత సేఫ్ అయినట్టే లెక్క. తండేల్ సినిమా 90 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారని తెలుస్తుంది. సినిమాపై ఇప్పటికే సూపర్ బజ్ ఏర్పడగా సినిమా ఓపెనింగ్స్ కూడా అదిరిపోయేలా ఉన్నాయని తెలుస్తుంది.