Music Maestro Ilayaraja : మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా.. లీగల్ నోటీస్ పై మిశ్రమ స్పందన..!
Music Maestro Ilayaraja తెలుగు తమిళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు మ్యూజిక్ అందించారు మాస్ట్రో ఇళయరాజా. 90వ దశకంలో తెలుగు సినిమాకు ఆయన అందించిన సంగీతం
- By Ramesh Published Date - 11:59 PM, Thu - 23 May 24

Music Maestro Ilayaraja తెలుగు తమిళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు మ్యూజిక్ అందించారు మాస్ట్రో ఇళయరాజా. 90వ దశకంలో తెలుగు సినిమాకు ఆయన అందించిన సంగీతం ఇప్పటికీ ఆ పాటలను వినేలా చేస్తున్నాయి. ఇళయరాజా మ్యూజిక్ తో సినిమా వస్తే చాలు అది సంగీతం పరంగా సూపర్ హిట్ అన్నట్టే లెక్క అనేలా చేసుకున్నారు. వయసు పెరగడం వల్ల సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఇళయరాజా అడపాదడపా కొన్ని సినిమాలకు పనిచేస్తున్నారు.
ఐతే సినిమాల కన్నా ఈమధ్య ఇళయరాజా పేరు వివాదాల్లో ఎక్కువ వినిపిస్తుంది. అప్పట్లో బాలు తో ఏదో ఒక సాంగ్ కి సంబందించి విభేధాలు వచ్చిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా కూలీ సినిమాలో ఇళయరాజా ట్యూన్ ని వాడుకున్నందుకు ఆ మేకర్స్ మీద లీగల్ యాక్షన్ కి సిద్ధమయ్యారు ఇళయరాజా. మరోపక్క లేటెస్ట్ సెన్సేషన్ మంజుమ్మల్ బోయ్స్ సినిమాపై కూడా లీగల్ యాక్షన్ కు రెడీ అయ్యారు ఇళయరాజా.
మంజుమ్మల్ బోయ్స్ సినిమాలో కమల్ హాసన్ గుణ సినిమాలోని ప్రియతమా నీవచట కుశలమా సాంగ్ వాడేశారు. సినిమా స్టార్టింగ్ టైటిల్స్ లో ఎండింగ్ లో వస్తుంది. కానీ తన పర్మిషన్ లేకుండా ఆ ట్యూన్ వాడినందుకు ఇళయరాజా ఆ టీం పై లీగల్ ఫైట్ కు సిద్ధమయ్యారు. అయితే మంజుమ్మల్ బోయ్స్ మేకర్స్ గుణ సినిమా ఆడియో సంస్థ, ఆ నిర్మాతల పర్మిషన్ మేరకే ఆ పాట వాడుకున్నామని అంటున్నారు.
ఇళయరాజా మాత్రం అది తనకు తెలియదు నా పాట వాడేశారు అంటూ లీగల్ యాక్షన్ కి దిగుతున్నారు. ఇళయరాజా వెర్షన్ ఏంటంటే ఆయన పాట వాడుకుంటున్న టైం లో తనకు ఒక మాట చెప్పి వాడుకుంటే బాగుంటుంది కదా అన్నట్టు తెలుస్తుంది. సంగీత ప్రపంచంలో ఇళయరాజాకి ఉన్న పేరు చాలా గొప్పది అలాంటిది ఆయన ఇలా తన సాంగ్స్ మీద లీగ ఫైట్ కు దిగడం అనేది ఫ్యాన్స్ కి మింగుడు పడట్లేదు.
ఇళయరాజా వెర్షన్ ఎలా ఉన్నా మంజుమ్మల్ బోయ్స్ మేకర్స్ మాత్రం ఈ విషయంలో తగ్గేదేలేదు అంటున్నారు. అయితే ఈ గొడవల వల్ల మ్యూజిక్ మాస్ట్రో మీద ఉన్న అభిమానం.. అభిప్రాయం రెండు మారే అవకాశం ఉందని చెప్పొచ్చు.
Also Read : Animal Touch for Pushpa 2 : పుష్ప 2 కి యానిమల్ టచ్.. నెక్స్ట్ లెవెల్ అంతే..!