Mrunal Thakur : నెల గ్యాప్ లో రెండు సినిమాలు రిలీజ్.. టాలీవుడ్ ని ఊపేస్తున్న అమ్మడు..!
బాలీవుడ్ సీరియల్స్ తో పరిచయమై ఆమె లోని టాలెంట్ తో సిల్వర్ స్క్రీన్ ఛాన్స్ లు అందుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)
- Author : Ramesh
Date : 30-10-2023 - 1:32 IST
Published By : Hashtagu Telugu Desk
బాలీవుడ్ సీరియల్స్ తో పరిచయమై ఆమె లోని టాలెంట్ తో సిల్వర్ స్క్రీన్ ఛాన్స్ లు అందుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) తెలుగులో సీతారామం సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకుంది. తెలుగులో తొలి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో అమ్మడికి ఇక్కడ సూపర్ క్రేజ్ ఏర్పడింది. అందుకే ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. నానితో హాయ్ నాన్న చేస్తున్న మృణాల్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)తో ఫ్యామిలీ స్టార్ సినిమా చేస్తుంది. ఈ రెండు సినిమాలతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తుంది మృణాల్ ఠాకూర్.
రెండు సినిమాలు కూడా నెల వ్యవధిలో రిలీజ్ అవుతున్నాయి. డిసెంబర్ 7న నాని (Nani) హాయ్ నాన్న ప్రేక్షకుల ముందుకు వస్తుండగా సంక్రాంతి రేసులో ఫ్యామిలీ స్టార్ (Family Star) దిగుతున్నాడు. సో రెండు నెలల్లో రెండు సినిమాలతో టాప్ లీగ్ లోకి వెళ్లనుంది మృణాల్ ఠాకూర్. రెండు సినిమాలు సూపర్ బజ్ తో వస్తున్నాయి. హాయ్ నాన్న లవ్ స్టోరీగా వస్తుండగా ఎమోషనల్ కంటెంట్ కూడా ఉంటుందని తెలుస్తుంది.
Also Read : Big Boss 7 : శోభాశెట్టి..మళ్లీ అదే రచ్చ..ఈసారి బయటకు వెళ్లడం ఖాయం
ఇక ఫ్యామిలీ స్టార్ సినిమా కూడా యూత్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తుంది. ఈ రెండు సినిమాల విషయంలో ఆడియన్స్ సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. కచ్చితంగా మృణాల్ ఈ రెండు సినిమాల తర్వాత అమ్మడి రేంజ్ పెరుగుతుందని చెప్పొచ్చు. ఇదే కాదు మెగా 156వ సినిమాలో కూడా మృణాల్ ఠాకూర్ నటిస్తుందని తెలుస్తుంది. ఈ సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.
తెలుగులో సత్తా చాటుతున్న మృణాల్ బాలీవుడ్ ఆఫర్లను కూడా ఓకే చెబుతుంది. అక్కడ కూడా స్టాడం కొనసాగించాలని చూస్తుంది మృణాల్. ఏది ఏమైనా మృణాల్ కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
We’re now on WhatsApp : Click to Join