Mohan Babu Attacked Media : మీడియా పై మోహన్ బాబు దాడి
Mohan Babu Attacked Media : మోహన్ బాబు..మీడియా మీద ఆగ్రహం వ్యక్తం చేసారు. టీవీ9 ప్రతినిధులపై దాడి చేయడమే కాకుండా, వారి మైక్ లాక్కుని హింసకు పాల్పడ్డారు
- By Sudheer Published Date - 08:24 PM, Tue - 10 December 24

మంచు ఫ్యామిలీ గొడవ (Manchu Family Fight) రోజు రోజుకు రచ్చకెక్కుతుంది. ఇప్పటికే మోహన్ బాబు (MohanBabu) , మనోజ్ (Manoj) లు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదులు చేసుకోవడం..ప్రాణ హాని ఉందంటూ ఫిర్యాదులో పేర్కోవడం జరిగింది. ఈ తరుణంలో ఈరోజు సాయంత్రం మనోజ్ అలాగే అతని భార్య మౌనిక జలపల్లిలోని మంచు టౌన్ వద్దకు చేరుకోగా..అక్కడ గేట్లు మూసివేసి ఉన్నాయి.
దీంతో లోపలి సెక్యూర్టీ ని మనోజ్ పిలిచి గేట్లు ఓపెన్ చేయాలనీ కోరాడు. ఆయనకాని వారు గేట్లు ఓపెన్ చేయకపోయేసరికి తన ప్రవైట్ సెక్యూరిటీ తో కలిసి గేట్లను ఓపెన్ చేసి లోపలి వెళ్తుండగా.. ఇదే క్రమంలో అక్కడే ఉన్న మీడియా సైతం లోపలి వెళ్ళింది. సరిగ్గా అక్కడే ఉన్న మోహన్ బాబు..మీడియా మీద ఆగ్రహం వ్యక్తం చేసారు. టీవీ9 మైక్ లాక్కొని ప్రతినిధి పై దాడి చేయడంతో పాటు బూతులు తిడుతూ రెచ్చిపోయారు.
ఈ ఘటనలో కొన్ని మీడియా ప్రతినిధులు గాయపడ్డారు. మోహన్ బాబు చేసిన పని పట్ల యావత్ మీడియా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. చిత్రసీమలో ఎంతో పేరున్న మోహన్ బాబు..ఇలా మీడియా పై దాడి చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ ప్రశ్నిస్తుంది. ప్రస్తుతం మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొనడం తో మోహన్ బాబు గన్ సీజ్ చేయాలని పోలీసు ఉన్నత అధికారులకు అదేశాలు జారీ చేశారు. మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు గన్ కూడా సీజ్ చేయాలని పోలీసు ఉన్నతాధికారులు అదేశాలు జారీ చేశారు.
మీడియా పై దాడికి పాల్పడ్డ మోహన్ బాబు మరియు ఆయన సిబ్బంది #ManchuMohanbabu #ManchuManoj #ManchuVishnu #Tollywood #HashtagU pic.twitter.com/xsoBYmLzZZ
— Hashtag U (@HashtaguIn) December 10, 2024
Read Also : Fake Teachers : డ్యూటీకి డుమ్మా.. ప్రైవేటు వ్యక్తులను డ్యూటీకి పంపుతున్న గవర్నమెంట్ టీచర్స్‌పై ఫోకస్