Godfather Collections: దసరా బాక్సాఫీస్ కింగ్ ‘గాడ్ ఫాదర్’.. ఫస్ట్ డే రూ. 38 కోట్లు వసూళ్లు!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ అన్ని చోట్లా హిట్ టాక్ తో రన్ అవుతోంది.
- By Balu J Published Date - 02:40 PM, Thu - 6 October 22
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ అన్ని చోట్లా హిట్ టాక్ తో రన్ అవుతోంది. అటు మాస్, ఇటు క్లాస్ అభిమానులు కూడా గాడ్ ఫాదర్ మూవీని ఎంజాయ్ చేస్తున్నారు. మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గాడ్ ఫాదర్’. దసరా పండగ రోజున విడుదలైంది. భారీ బ్లాక్ బస్టర్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమా వసూళ్లను చిత్రబృందం ప్రకటించింది. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.38 కోట్ల గ్రాస్ వచ్చినట్లు పేర్కొంటూ ఈ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ మూవీకి అంతటా హిట్ టాక్ వినిపిస్తుండటంతో పలు రికార్డులను బద్దలుకొట్టే వీలుంది.
రామ్ చరణ్, R. B. చౌదరి, N. V. ప్రసాద్‌లు సంస్థలు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్‌పై గాడ్ ఫాదర్ ను నిర్మించారు. ఇప్పటికీ ఈ సినిమాపై బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ప్రశంసలు కురిపించారు. లవ్ యూ చిరు అంటూ ఓ వీడియో ను షేర్ చేశారు. దసరా బరిలో చిరు సినిమాతో పాటు నాగార్జున ఘోస్ట్, బెల్లంకొండ సురేశ్ తనయుడు నటించిన స్వాతిముత్యం, మరికొన్ని సినిమాలు విడులయ్యాయి. కానీ దసరా బరిలో గాడ్ ఫాదర్ టాప్ ప్లేస్ లో నిలిచింది.
HUMONGOUS BLOCKBUSTER #GodFather off to a sensational start 💥
Worldwide gross of 38 CR+ on DAY 1 🔥Book your tickets now! 🔥
–https://t.co/pkIzwUFJtn#BlockbusterGodfather 🔥@KChiruTweets @BeingSalmanKhan @jayam_mohanraja #Nayanthara @MusicThaman @ActorSatyaDev @ProducerNVP pic.twitter.com/a6pzEnh780— Super Good Films (@SuperGoodFilms_) October 6, 2022
Related News
Megastar Chiranjeevi Viswambhara : విశ్వంభర కోసం అన్ని సెట్లు వేస్తున్నారా..?
Megastar Chiranjeevi Viswambhara సినిమా కోసం 17 సెట్లు దాకా వేస్తున్నారని తెలుస్తుంది. ఆల్రెడీ ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోలో