Mega Star: మెగాస్టార్ యాడ్…కుమ్మేశాడుగా…
మెగాస్టార్ చిరంజీవి వెండితెరపై కనిపించి చాలా కాలం అవుతోంది. చిరు చివరిగా నటించిన సైరా మూవీ వచ్చి మూడుళ్లు దాటింది. కోవిడ్ కారణంగా చిరంజీవి కొత్త సినిమాల్లో నటించలేదు.
- By Hashtag U Published Date - 10:24 AM, Sun - 3 April 22
మెగాస్టార్ చిరంజీవి వెండితెరపై కనిపించి చాలా కాలం అవుతోంది. చిరు చివరిగా నటించిన సైరా మూవీ వచ్చి మూడుళ్లు దాటింది. కోవిడ్ కారణంగా చిరంజీవి కొత్త సినిమాల్లో నటించలేదు. ఆయన నటించిన ఆచార్య సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఉన్నా…వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. చివరిగా ఈ మూవీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ అయ్యింది. ఏప్రిల్ 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇందులో రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు.
అయితే ఈ మూవీ కంటే ముందుగానే చిరంజీవి ఓ కమర్షియల్ యాడ్ లో కనిపించి ఫ్యాన్స్ ను ఫిదా చేశాడు. ఇందులో చిరంజీవి గెటప్, డైలాగ్స్ ఎంతగానో మెప్పించాయి. నిజానికి చిరంజీవి యాడ్స్ కూ చాలా దూరంగా ఉంటున్నారు. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ యాడ్ లో కనిపించారు. శుభగృహ కోసం చిరంజీవి ఈ యాడ్ చేశారు. సుకుమార్ దీనికి దర్శకత్వం వహించారు.
ఈ యాడ్ లో మెగాస్టార్ తోపాటుగా నటి ఖుష్బు, యాంకర్ అనసూయ కనిపించారు. ఉగాది సందర్భంగా ఈ యాడ్ ను రిలీజ్ చేశారు. 30 సెకన్ల పాటు ఈ యాడ్ లో చిరంజీవి తన కామెడీ టైమింగ్ మిస్ కానివ్వలేదు. పైగా యంగ్ లుక్ లో అదుర్స్ అనిపించారు. యాడ్ మాదిరి కాకుండా…చిన్న పిట్ట కథలా రూపొందించడం చాలా బాగుంది. ఈ యాడ్ పై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. చాన్నాళ్ల తర్వాత చిరును ఇలా చూసి ఫ్యాన్స్ తెగ సంతోష పడుతున్నారు.
Related News
Bezawada Prasanna Kumar: అనసూయ ఇండస్ట్రీలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంది : రచయిత ప్రసన్నకుమార్
తెలుగు ప్రేక్షకులకు ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనసూయ ప్రస్తుతం చేతినిండా అవకాశాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు యాంకర్ గా తన సత్తాను చాటుతూ బుల్లితెర ప్రేక్షకులను అలరించిన అనసూయ ప్రస్తుతం నటిగా వరుసగా అవకాశాలను అందుకుంటూ వెండితెర ప్రేక్షకులను కూడా అలరిస్తూ క్షణం కూడా తీరిక లేకుండా ఫుల్ బిజీ బిజీగా గడుపుత�