Mega Fans Request : అన్నయ్య..ఇకనైనా రీమేక్ ల జోలికి వెళ్లకండి..చూడలేకపోతున్నాం
- Author : Sudheer
Date : 11-08-2023 - 4:17 IST
Published By : Hashtagu Telugu Desk
టాలీవుడ్ లో ప్రస్తుతం రీమేక్ ల ట్రెండ్ నడుస్తుంది. ముఖ్యంగా మెగా హీరోలైతే వరుసగా రీమేక్ లు చేస్తూ వెళ్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే వకీల్ సాబ్ , భీమ్లా నాయక్ , బ్రో సినిమాలు చేయగా..ఇవేవి కూడా అభిమానులను అలరించలేకపోయాయి. చిరంజీవి సైతం ఇటీవల గాడ్ ఫాదర్ చేసాడు అది భారీ ప్లాప్ అయ్యింది. ఇక భోళా శంకర్ (Bhola Shankar) అంటూ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వేదాళం మూవీ కి రీమేక్ గా ఇది తెరకెక్కింది. ఉదయం ఆటతోనే ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చింది. రెండు , మూడు రోజుల కంటే సినిమా ఎక్కువ నడవదని సాక్ష్యాత్తు మెగా అభిమానులే అంటున్నారు. అలాగే చిరంజీవి ని రిక్వెస్ట్ చేస్తున్నారు.
దయచేసి రీమేక్ ల జోలికి వెళ్లకండి అన్నయ్య (Chiru)..మీ సినిమా కోసం ఎన్ని రోజులైనా ఎదురుచూస్తాం..మాకోసం మీరు త్వరగా సినిమా పూర్తి అవుతుందని రీమేక్ లు చేసి పరువు తీసుకోకండి..మంచి కథ దొరికినప్పుడే సినిమా చెయ్యండి. అంతే కానీ తమిళంలో హిట్ అయ్యిందని , హిందీ హిట్ అయ్యిందని చెప్పి ఆ కథలకు ఓకే చెప్పకండి. అక్కడ చూస్తారేమో..కానీ మీము మాత్రం మీ దగ్గరి నుండి అలాంటి సినిమాలు చూడలేం ప్లీజ్ అంటున్నారు.
తాజాగా చిరంజీవి మరో రీమేక్ కు రెడీ అవుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మలయాళంలో యావరేజ్ హిట్ గా నిలిచిన బ్రో డాడీ (Bro Daddy) సినిమాను రీమేక్ చేసేందుకు ఒప్పుకున్నారట. ఈ సినిమాను సోగ్గాడే చిన్నినాయన(Soggade Chinninayana) ఫేమ్ కళ్యాణ్ కృష్ణ కురసాల(Kalyan krishna kurasala) దర్శకత్వం వహిస్తున్నారని సమాచారం. అందుకే మెగా ఫ్యాన్స్ ముందే కంగారు పడుతూ.. భోళా శంకర్ రిజల్ట్ చూసైనా ఈ బ్రో డాడీ రీమేక్ ను ఆపేయండి అన్నయ్యా అంటూ మెగాస్టార్ ను రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. మరి ఫ్యాన్స్ మాట విని ఈ రీమేక్ సినిమాను ఆపేస్తారా..లేదా అనేది చూడాలి.
Read Also : Bhola Shankar : భజన పొగడ్తలకి చిరంజీవి అలవాటు పడ్డాడంటూ వర్మ సెటైర్లు..