Mega 156 : మెగా 156 విలన్ గా రానా.. మరో స్టార్ కూడా..!
Mega 156 మెగాస్టార్ చిరంజీవి 156వ సినిమా బింబిసారా ఫేం వశిష్ట డైరెక్షన్ లో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అనుష్క హీరోయిన్ గా నటిస్తుండగా సినిమాలో
- By Ramesh Published Date - 09:17 PM, Sat - 18 November 23
Mega 156 మెగాస్టార్ చిరంజీవి 156వ సినిమా బింబిసారా ఫేం వశిష్ట డైరెక్షన్ లో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అనుష్క హీరోయిన్ గా నటిస్తుండగా సినిమాలో చాలా పెద్ద క్యాస్టింగ్ ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి 156వ సినిమాలో దగ్గుబాటి హీరో రానా విలన్ గా నటిస్తున్నాడని ఎక్స్ క్లూజివ్ టాక్. మెగా 156 సినిమాలో రానా నటించడం సినిమాపై అంచనాలను డబుల్ చేసింది.
బాహుబలి సినిమా ఆ రేంజ్ లో హిట్ అయ్యింది అంటే రానా చేసిన భళ్లాలదేవ పాత్ర బాగా వర్క్ అవుట్ అవడమే అని చెప్పొచ్చు. హీరోగానే కాదు సినిమాలో పాత్ర బలమైనది అనుకుంటే ఎలాంటి పాత్ర చేయడానికైనా రానా రెడీగా ఉంటాడు. ఈ క్రమంలో మెగా 156 సినిమాలో రానా ఫిక్స్ అయ్యాడని తెలుస్తుంది. సో చిరంజీవి రానా మధ్య ఫైట్ చూడబోతున్నాం అన్నమాట.
వశిష్ట ఈ సినిమాను మరో జగదేకవీరుడు అతిలోకసుందరి రేంజ్ లో తీయాలని ప్లాన్ చేస్తున్నారు. సినిమాకు రెండు మూడు టైటిల్స్ కూడా పరిశీలనలో ఉన్నాయి. ఏది ఏమైనా చిరు సినిమాలో రానా నటించడం ప్రాజెక్ట్ పై సూపర్ బజ్ ఏర్పడుతుంది. రానాతో పాటుగా ఈ సినిమాలో సునీల్ కూడా ఇంపార్టెంట్ రోల్ లో కనిపిస్తాడని టాక్. మొత్తానికి మెగా 156 సినిమాను మెగా మూవీగానే భారీ స్థాయిలో తెరకెక్కించేలా చూస్తున్నారు మేకర్స్.
Also Read : Sai Pallavi : కమర్షియల్ స్టార్ తో సాయి పల్లవి.. పర్ఫెక్ట్ ఛాయిస్..!
We’re now on WhatsApp : Click to Join
Related News
Megastar Chiranjeevi Viswambhara : విశ్వంభర కోసం అన్ని సెట్లు వేస్తున్నారా..?
Megastar Chiranjeevi Viswambhara సినిమా కోసం 17 సెట్లు దాకా వేస్తున్నారని తెలుస్తుంది. ఆల్రెడీ ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోలో