Chiranjeevi Heroine : గుర్తుపట్టలేనంతగా మారిపోయిన చిరంజీవి హీరోయిన్
Chiranjeevi Heroine : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కెరీర్‌లో ప్రత్యేకమైన స్థానం కలిగిన 'ఆపద్బాంధవుడు' సినిమాలో ఆమె నటన ఇప్పటికీ ఎంతో మందిని మధురస్మృతుల్లోకి తీసుకుపోతుంది
- By Sudheer Published Date - 12:38 PM, Sun - 3 August 25

ఒకప్పుడు వెండితెరపై తన అందంతో, అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన గ్లామర్ క్వీన్ మీనాక్షి శేషాద్రి (Meenakshi Seshadri) గురించి ప్రస్తుతం మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కెరీర్‌లో ప్రత్యేకమైన స్థానం కలిగిన ‘ఆపద్బాంధవుడు’ సినిమాలో ఆమె నటన ఇప్పటికీ ఎంతో మందిని మధురస్మృతుల్లోకి తీసుకుపోతుంది. ప్రత్యేకించి “ఔరా అమ్మకుచెల్లా” పాటలో ఆమె అద్భుతమైన డాన్సింగ్ స్కిల్స్, నైవ్వల్యంతో అభిమానులను ఆకట్టుకుంది. అప్పుడు ఆమె అందానికి, ప్రతిభకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.
మీనాక్షి శేషాద్రి ప్రధానంగా బాలీవుడ్‌లోనే ఎక్కువ సినిమాలు చేసినా, ‘ఆపద్బాంధవుడు’ (Apadbhandavudu) చిత్రం ఆమెకు తెలుగు పరిశ్రమలో ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చింది. అయితే ఆ సినిమా తర్వాత ఆమె టాలీవుడ్‌లో పెద్దగా కనిపించలేదు. తక్కువకాలం నటించినా తనదైన ముద్రను వేసుకున్న మీనాక్షి, సినిమా రంగానికి దూరమైన తర్వాత అమెరికాలో స్థిరపడి కుటుంబ జీవితం గడుపుతున్నారు. అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా తరచూ తన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.
MS Dhoni: సీఎస్కే జట్టులో కొన్ని లోపాలు ఉన్నాయి.. ఎంఎస్ ధోనీ సంచలన వ్యాఖ్యలు
ఇటీవల ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన కొన్ని ఫోటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. 60 దాటిన వయస్సులో కూడా మీనాక్షి అందాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. “ఓల్డ్ ఈజ్ గోల్డ్”, “నాచురల్ బ్యూటీ” వంటి కామెంట్లతో నెటిజన్లు ఆమెను మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు. 18 ఏళ్ల వయసులో మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్న మీనాక్షి, తన నటనతో పాటు డాన్స్ స్కిల్స్‌తో కూడా యువతను మాయ చేశారని ఇప్పుడు అందరూ చెబుతున్నారు.
మీనాక్షి శేషాద్రి గురించి అప్పట్లో చాలామంది స్టార్ హీరోలు కూడా బాగా ఇష్టపడేవారని, ఓ అగ్రహీరో ఆమె అందానికి పూర్తిగా లోనైపోయాడని అనేక కథనాలు వచ్చాయి. అయితే ఇవన్నీ అప్పట్లో గాసిప్స్‌గానే మిగిలిపోయాయి. ఆమె చేసిన సినిమాలు, అందులో చూపిన నటన ఆమెకు కలిగిన క్రేజ్‌ను చూపిస్తాయి. ఇప్పుడు కూడా ఆమెపై ప్రేక్షకుల్లో ఉన్న ప్రేమ, అభిమానమే ఆమెను సోషల్ మీడియాలో ఓ ట్రెండ్‌గా నిలిపింది.