Meenakshi Chaudhary : లక్కీ బ్యూటీకి మరో ఛాన్స్..
Meenakshi Chaudhary : రీసెంట్ గా లక్కీ భాస్కర్ (Lucky Baskar) మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత 'మట్కా' తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. అయినప్పటికీ అమ్మడి క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఈ వారం మెకానిక్ రాకీ తో ప్రేక్షకుల ముందుకు వస్తుంది
- By Sudheer Published Date - 11:56 AM, Tue - 19 November 24

మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary)..ప్రస్తుతం ఈ పేరు టాలీవుడ్ లో వైరల్ గా మారింది. 2018లో “మిస్ గ్రాండ్ ఇండియా” టైటిల్ గెలుచుకుని, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. “ఇచ్చట వాహనములు నిలుపరాదు” సినిమాతో తెలుగు లో పరిచమైంది. ఆ తర్వాత “ఖిలాడి,” “హిట్ 2” వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గుంటూరు కారం (Gunturu Kaaram) మూవీ లో మహేష్ కు జోడిగా నటించి మరింత క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమా తో త్రివిక్రమ్ (Trivikram) దగ్గర మంచి మార్కులు కొట్టేయడం తో..గురూజీ వల్ల అమ్మడికి వరుస ఛాన్సులు దక్కుతున్నాయి.
రీసెంట్ గా లక్కీ భాస్కర్ (Lucky Baskar) మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత ‘మట్కా’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. అయినప్పటికీ అమ్మడి క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఈ వారం మెకానిక్ రాకీ తో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అలాగే హీరో వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మూవీలో నటిస్తుంది. ఇదిలా ఉండగానే తాజాగా మరో ఆఫీస్ కొట్టేసినట్లు తెలుస్తుంది.
‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ వర్మ దండు – నాగ చైతన్య కలయికలో ఓ సినిమా తెరకెక్కబోతుంది. స్క్రిప్టు పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఇప్పుడు నటీనటులు ఇతర సాంకేతిక నిపుణుల కోసం ఎంపిక జరుగుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరిని ఎంచుకొన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. చైతూ పక్కన నటించడం మీనాక్షికి ఇదే తొలిసారి. ఈ కాంబో ఫ్రెష్ గా ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారట. నిన్నటి వరకు ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటించబోతోందని కూడా వార్తలు వినిపించాయి. మరి ఆమెను వద్దనుకుని ఈమెను ఓకే చేసారా..? లేక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండబోతున్నారా..? అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికి ప్రస్తుతం మాత్రం టాలీవుడ్ లో మీనాక్షి హావ నడుస్తుంది.
Read Also : Jani Master : జైలు నుండి వచ్చాక ఫస్ట్ టైం సినిమా ఫంక్షన్లో మాట్లాడిన జానీ మాస్టర్..