Devara: దుమ్మురేపుతున్న దేవర, హైదరాబాద్ లో భారీ షెడ్యూల్
- By Balu J Published Date - 05:12 PM, Fri - 19 January 24
Devara: జనతా గ్యారేజ్ సక్సెస్ తర్వాత కొరటాల శివతో జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ జతకట్టడంతో తెలుగు సినిమాల్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో దేవర ఒకటి. అనిరుధ్ సంగీతం అందించిన ఈ సినిమా 80% షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ షెడ్యూల్‌ను ప్రారంభించినట్లు సమాచారం. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ సెట్‌ను వేసి మరో రెండు వారాల పాటు షూటింగ్ జరుపుకోనుంది.
సరే, ఈ సినిమా 2024 ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నందున, ప్రీ రిలీజ్ బిజినెస్ వేడెక్కింది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కొనుగోలు చేసేందుకు పలువురు పెద్ద నిర్మాతలు ముందుకొస్తున్నారు. దేవర సినిమాతో టాలీవుడ్లో జాన్వీ కపూర్ ఎంట్రీ ఇస్తోంది. సైఫ్ అలీఖాన్ కూడా నటిస్తున్నాడు. ఇటీవల విడుదలైన టీజర్ ఆద్యంతం సంచలనం సృష్టించింది.
దేవర’. కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో హై రేంజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ మూవీ రూపొందుతోంది. ఇండియాలోనే ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో రాబోతున్న ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. అందులో మొదటి దాన్ని ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ నటిస్తోన్న ‘దేవర’ మూవీకి సంబంధించిన షూటింగ్ గత ఏడాదిలోనే ప్రారంభం అయింది. అప్పటి నుంచి ఏమాత్రం బ్రేకులు లేకుండా దీన్ని షూట్ చేస్తున్నారు. ఇలా ఇప్పటికే 85 శాతం కంటే ఎక్కువగానే టాకీ పార్టును పూర్తి చేసేశారు. అదే సమయంలో ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్‌ను కూడా స్టార్ట్ చేశారు.
Related News
Nidhhi Agerwal: నిధి అగర్వాల్ కెరీర్ ట్రాక్ లో పడేనా.. ?
Nidhhi Agerwal: నిధి అగర్వాల్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్, ప్రభాస్ లతో ‘హరి హర వీరమల్లు’, ‘రాజాసాబ్’ చిత్రాల్లో నటిస్తోంది. ఈ ఇద్దరు హీరోలతో నిధికి టాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. నిధి బ్యాడ్ టైం ఎదుర్కొంటోందని, ఇప్పుడు ఆమె తన కెరీర్‌ను తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పీరియాడిక్ డ్రామాలో పవన్ కు ప్రేమికురాలిగా నటిస్తుండటంతో హరి హర వీరమల్�