Manchu Manoj Gets Emotional :మా నాన్న దేవుడు అంటూ మంచు మనోజ్ పెద్ద షాక్
Manchu Manoj Gets Emotional : భావోద్వేగానికి (Manchu Manoj Gets Emotional) గురైన మనోజ్ తన భార్య 7 నెలల గర్భవతిగా ఉన్నపుడు ఎన్నో బాధలు అనుభవించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి గతంలో అలా ఉండేవారు కాదని అన్నారు
- Author : Sudheer
Date : 11-12-2024 - 1:58 IST
Published By : Hashtagu Telugu Desk
మోహన్ బాబు – మనోజ్ (Manchu Family Fight)మధ్య నడుస్తున్న గొడవ ఇప్పుడు మీడియా లో ట్రేండింగ్ గా నడుస్తుంది. రెండు రోజులుగా ప్రతి మీడియా ఛానల్ లోనే కాదు సోషల్ మీడియా లో , సినీ పరిశ్రమ లో దీని గురించే మాట్లాడుకుంటున్నారు. మోహన్ బాబు , మనోజ్ (Mohanbabu Vs Manoj) ఇద్దరు కూడా పోలీసులకు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం..ప్రాణ హాని ఉందంటూ రక్షణ కోరడంతో అసలు వీరి మధ్య ఏంజరిగింది..? ఏం జరుగుతుంది..? అని అరా తీస్తున్నారు. ఇదే క్రమంలో నిన్న ఏకంగా దాడుల వరకు వెళ్లడం మరింత సంచలనం రేపింది. అంతే కాదు గొడవ ను కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా పై మోహన్ బాబు దాడి చేయడం..దీనికి రిపోర్ట్స్ మోహన్ బాబు పై కేసు పెట్టడం..ఆ తర్వాత మోహన్ బాబు అస్వస్థతకు గురి కావడం ఇదంతా చకచకా జరిగిపోయింది. నిన్న రాత్రి వరకు మోహన్ బాబు పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చిన మనోజ్..ఈరోజు మా నాన్న దేవుడు అంటూ చెప్పి షాక్ ఇచ్చాడు.
మీడియాపై దాడి చేసినందుకు తన తండ్రి మోహన్ బాబు తరఫున మీడియాకు మనోజ్ క్షమాపణలు చెప్పారు. మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి (Manchu Manoj Gets Emotional) గురైన మనోజ్ తన భార్య 7 నెలల గర్భవతిగా ఉన్నపుడు ఎన్నో బాధలు అనుభవించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి గతంలో అలా ఉండేవారు కాదని అన్నారు. తన తండ్రి తనకు దేవుడు అని, అయితే, ఈరోజు కనిపిస్తున్న మా నాన్న మా నాన్న కాదని షాకింగ్ కామెంట్లు చేశారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని, తాను ఎప్పుడూ ఎవరినీ ఆస్తులు అడగలేదని అన్నారు. తన వ్యక్తిగత జీవితం గురించి నాన్నగారికి లేనిపోనివి చెప్పారని, ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో నాన్నతో తనకు విభేదాలు సృష్టించారని వాపోయారు. ఈ గొడవలోకి తన భార్య, 7 నెలల కూతురి పేరును లాగుతున్నారని అన్నారు. తన సొంత కాళ్ల మీద నిలబడేందుకు తాను ప్రయత్నిస్తున్నానని, మీడియాపై దాడి చేయడం బాధ కలిగించిందని, క్షమాపణ చెబుతున్నానని అన్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి అన్ని నిజాలను బయటపెడతానని మనోజ్ మీడియా ముందు ఎమోషనల్ అయ్యారు. మరి మనోజ్ ఎలాంటి నిజాలు బయటపెడతాడనేది ఆసక్తి కరంగా మారింది.
అన్న విష్ణు, నాన్న దృష్టిలో నన్ను శత్రువుగా చిత్రీకరించారు #ManchuManoj #journalists #ManchuMohanbabu #ManchuFamily #ManchuFamilyIssue #HashtagU@HeroManoj1 pic.twitter.com/lDVc6LANep
— Hashtag U (@HashtaguIn) December 11, 2024
Read Also : Pawan Kalyan : వరల్డ్ లోనే అరుదైన రికార్డు సాధించిన పవన్ కళ్యాణ్