Manchu Manoj Wedding Video : వైరల్ అవుతున్న మంచు మనోజ్ – భూమా మౌనిక పెళ్లి వీడియో మీరు చూశారా?
తాజాగా మనోజ్ - మౌనికల పెళ్లి వీడియోని రిలీజ్ చేశారు. ఇందుకోసం ఓ స్పెషల్ సాంగ్ కూడా రాపించారు.
- By News Desk Published Date - 06:30 PM, Tue - 18 April 23

మంచు మనోజ్(Manchu Manoj) గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉన్న మనోజ్ ఇటీవలే తన నెక్స్ట్ సినిమాని ప్రకటించాడు. గతంలో విడాకులు తీసుకున్న మనోజ్ ఇటీవల మాజీ దివంగత రాజకీయనాయకుడు భూమా నాగిరెడ్డి(Bhuma Nagireddy) రెండో కూతురు భూమా మౌనికను(Bhuma Mounika) ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. భూమా మౌనిక – మనోజ్ వివాహం వార్తల్లో నిలిచింది. ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం, ప్రేమ వివాహం కావడంతో సింపుల్ గా అతి తక్కువ మంది సన్నిహితుల మధ్యలో మనోజ్ ఇంట్లోనే మార్చ్ 3న వివాహం జరిగింది.
వీరి వివాహం అయిన దగ్గర్నుంచి ఈ జంట ఏదో ఒక రకంగా వైరల్ అవుతూనే ఉంది. వీరిద్దరి ఫోటో కనిపిస్తే జంట చాలా బాగుందని కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల వీరిద్దరూ కలిసి ఓ టీవీ షోకు కూడా వచ్చి అలరించారు. పెళ్లి సమయంలో కొన్ని ఫోటోలు మాత్రం బయటకి వదిలారు. తాజాగా మనోజ్ – మౌనికల పెళ్లి వీడియోని రిలీజ్ చేశారు. ఇందుకోసం ఓ స్పెషల్ సాంగ్ కూడా రాపించారు.
ఏం మనసో.. అంటూ సాగే ఓ పాటని అనంత్ శ్రీరామ్ రాయగా సంగీత దర్శకుడు అచ్చు రాజమణి సంగీతం అందించి, పాటని పాడాడు. ఈ పాటతో మనోజ్ – మౌనికల పెళ్లి వీడియోని రిలీజ్ చేశారు. ఇందులో వీరి నిశ్చితార్థం, పెళ్లి వేడుకలు, పెళ్ళిలో జరిగే పలు ఘట్టాలన్నీ చూపిస్తూ చాలా అందంగా తయారుచేశారు వీడియోని. వీరి పెళ్ళికి విచ్చేసిన బంధువులు, సినీ, రాజకీయ ప్రముఖులను కూడా ఇందులో చూపించారు. దీంతో మనోజ్ పెళ్లి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోసారి ఈ జంట చాలా బాగుంది అంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : Samantha Reaction: శాకుంతలం ఫెయిల్యూర్ పై సమంత రియాక్షన్.. గీతోపదేశం చేస్తూ కౌంటర్!