Manchu Lakshmi : హైదరాబాద్ ఓటర్స్‌ని చూస్తే సిగ్గేస్తుంది.. మంచు లక్ష్మి వైరల్ కామెంట్స్..
హైదరాబాద్ ఓటర్స్‌ని చూస్తే సిగ్గేస్తుంది అంటూ మంచు లక్ష్మి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
- Author : News Desk
Date : 13-05-2024 - 1:50 IST
Published By : Hashtagu Telugu Desk
Manchu Lakshmi : నేడు దేశమంతటా ఎన్నికల హడావుడి కనిపిస్తుంది. ఈక్రమంలోనే తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతుంటే, ఏపీలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ కి ఎన్నికలు జరుగుతున్నాయి. ఏపీ ఓటర్స్ తమ హక్కుని ఉపయోగించుకోవడం కోసం.. పోలింగ్ బూత్ వద్దకి చేరుకుంటున్నారు. అయితే హైదరాబాద్ లో మాత్రం చాలా తక్కువ వోటింగ్ జరుగుతుంది. దీని గురించి మంచు లక్ష్మి వైరల్ కామెంట్స్ చేసారు.
తన ఓటు హక్కుని వినియోగించుకోవడం కోసం.. మంచు లక్ష్మి ముంబై నుంచి వచ్చారంట. కానీ హైదరాబాద్ లో ఉన్న ప్రజలు పోలింగ్ బూత్ వద్దకి వచ్చి ఓటు వేయడానికి ఆలోచిస్తున్నారని అసహనం వ్యక్తం చేసారు. హైదరాబాద్ లో ఇప్పటివరకు 5 శాతం ఓటింగ్ మాత్రమే జరిగిందని, ఇంత తక్కువ ఓటింగ్ చూస్తుంటే సిగ్గేస్తుందని లక్ష్మి పేర్కొన్నారు. అందరూ బయటకు వచ్చి ఓటు వేయాలంటూ హైదరాబాద్ ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఓటర్స్ ని కోరారు.
జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో మంచు లక్ష్మి తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఈ ఓటు వేసిన తరువాత మంచు లక్ష్మి మాట్లాడుతూ.. “దేశ అభివృద్ధి కోసం, మన వాయిస్ వినిపించడం కోసం ఓటు వేయాలి. కాబట్టి ఓటర్స్ అందరూ తమ ఓటుని వినియోగించుకోవాలని కోరుతున్నాను. అలాగే ఎలక్షన్ విధానంలో కూడా మార్పు రావాలి. ఎక్కడెక్కడో ఉండి, రాలేని పరిస్థితుల్లో ఉన్నవారు కూడా తమ ఓటుని వినియోగించుకునేలా ఎన్నికల విధానంలో కూడా మార్పు కావాలి” అంటూ విన్నపించారు.
Also read : NTR Shirt Colour: వైసీపీ పార్టీ కోసం ఎన్టీఆర్ ప్రచారం.. చొక్కా వైరల్