Renjusha Menon : ప్రముఖ నటి ఆత్మహత్య.. షాక్ లో సినీ, టెలివిజన్ ప్రముఖులు..
రెంజూషా మీనన్ ప్రస్తుతం తన భర్త మనోజ్, తల్లితండ్రులతో కలిసి తిరువనంతపురంలో ఓ ఫ్లాట్ లో ఉంటుంది. ఇవాళ ఉదయం రెంజూషా మీనన్ తన గదిలో తాడుతో ఉరి వేసుకొని కనిపించింది.
- By News Desk Published Date - 06:05 PM, Mon - 30 October 23

తాజాగా కేరళలో మలయాళం నటి(Malayalam Actress) రెంజూషా మీనన్(Renjusha Menon) ఆత్మహత్య చేసుకొని అందర్నీ షాక్ కి గురిచేసింది. రెంజూషా మీనన్ మలయాళంలో బుల్లితెరపై యాంకర్ గా, పలు సీరియల్స్ లో నటిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. పలు మలయాళం సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించింది.
రెంజూషా మీనన్ ప్రస్తుతం తన భర్త మనోజ్, తల్లితండ్రులతో కలిసి తిరువనంతపురంలో ఓ ఫ్లాట్ లో ఉంటుంది. ఇవాళ ఉదయం రెంజూషా మీనన్ తన గదిలో తాడుతో ఉరి వేసుకొని కనిపించింది. కుటుంబ సభ్యులు చూసి దిగ్బ్రాంతికి గురయి ఆమెని హాస్పిటల్ కి తరలించగా అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగారు.
రెంజూషా మీనన్ ఆత్మహత్య చేసుకుందని తెలిసి మలయాళ టెలివిజన్ పరిశ్రమ షాక్ కి గురైంది. పలువురు అభిమానులు, ప్రముఖులు ఆమెకు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు. ఆమె ఆత్మహత్య ఎందుకు చేసుకుందో కారణాలు తెలియలేదు కానీ, ఆర్ధిక ఇబ్బందులు ఉండొచ్చు అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Malayalam Actress #RenjushaMenon Dies By Suicide At Her #Kerala Homehttps://t.co/TqgBiS44mw
— Free Press Journal (@fpjindia) October 30, 2023
Also Read : Leo Collections : లియో సినిమా కలెక్షన్స్ ఫేక్? థియేటర్స్ ఓనర్స్ ఆగ్రహం.. స్పందించిన డైరెక్టర్..