Mahesh Babu : గుంటూరు కారంలో పూజా హెగ్దె.. మళ్లీ మొదటికొచ్చిన మ్యాటర్..!
Mahesh Babu సూపర్ స్టార్ మహేష్ త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న గుంటూరు కారం సినిమాలో ముందు పూజా హెగ్దేని హీరోయిన్ గా అనుకోగా ఆమె ప్లేస్ లో శ్రీ లీల
- By Ramesh Published Date - 05:08 PM, Mon - 30 October 23
Mahesh Babu సూపర్ స్టార్ మహేష్ త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న గుంటూరు కారం సినిమాలో ముందు పూజా హెగ్దేని హీరోయిన్ గా అనుకోగా ఆమె ప్లేస్ లో శ్రీ లీల (Sree Leela) మెయిన్ హీరోయిన్ అయ్యింది. ఇక శ్రీ లీలకు అనుకున్న పాత్రకు మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary)ని తీసుకున్నారు.
పూజా హెగ్దే వేరే కమిట్మెంట్ ల వల్ల మహేష్ సినిమా ఛాన్స్ వదులుకోవాల్సి వచ్చింది. అయితే పూజా హెగ్దే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ అయినా చేయించాలని చూస్తున్నారు. ఎలాగు సినిమా కోసం కొంత అడ్వాన్స్ తీసుకుంది కాబట్టి పూజా కూడా స్పెషల్ సాంగ్ కి నో చెప్పే ఛాన్స్ లేదు.
Also Read : Vijay Devarakonda : కల్కిలో విజయ్ దేవరకొండ.. సూపర్ హీరో లుక్స్ కిరాక్..!
అయితే ఈ విషయంలో కూడా క్లారిటీ రావట్లేదు. హీరోయిన్ గా కాకపోయినా సరే గుంటూరు కారంలో పూజా హెగ్దే (Pooja Hegde) ఐటం సాంగ్ ఉంటుందా అంటే మేకర్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రావట్లేదు. మహేష్ సినిమా విషయంలో జరుగుతున్న ఈ జాప్యతపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహంగా ఉన్నారు.
ఇక సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ లాక్ చేశారు. సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ త్వరలో రిలీజ్ చేయనున్నారు. మహేష్ మాస్ పోస్టర్స్ గుంటూరు కారం (Gunturu Karam) కి క్రేజ్ తెస్తున్నా సినిమా నుంచి అప్డేట్స్ చాలా లేట్ చేస్తుండటం వల్ల ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. పూజా హెగ్దే ఐటం సాంగ్ ఉంటే కచ్చితంగా సినిమాకు హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు.
We’re now on WhatsApp : Click to Join