Mahesh : కుర్చి మడతపెట్టి సాంగ్.. త్రివిక్రం పై ట్రోల్స్ చూశారా..!
Mahesh సూపర్ స్టార్ మహేష్ త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న గుంటూరు కారం సినిమా నుంచి థర్డ్ సింగిల్ ఆ కుర్చి మడతపెట్టి నిన్న ప్రోమో రిలీజ్ కాగా
- Author : Ramesh
Date : 30-12-2023 - 5:41 IST
Published By : Hashtagu Telugu Desk
Mahesh సూపర్ స్టార్ మహేష్ త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న గుంటూరు కారం సినిమా నుంచి థర్డ్ సింగిల్ ఆ కుర్చి మడతపెట్టి నిన్న ప్రోమో రిలీజ్ కాగా లేటెస్ట్ గా ఆ సాంగ్ మొత్తం రిలీజ్ చేశారు. మాస్ సాంగ్ గా వస్తున్న కుర్చి మడతపెట్టి సాంగ్ సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ కి సూపర్ జోష్ అందిస్తుంది. అయితే ఈ సాంగ్ ని అసలు త్రివిక్రం ఎలా పెట్టాలని అనుకున్నారా అన్నది కొందరు ఆలోచిస్తున్నారు.
We’re now on WhatsApp : Click to Join
ముఖ్యంగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గురించి చెప్పిన ఓ ఈవెంట్ లో సినిమా పాటలు దిగజారుతున్న వేళ అంటూ సిరివెన్నెల గేయ రచన గురించి గొప్పగా చెప్పారు. అలా చెప్పిన గురూజీ ఇప్పుడు తన సినిమాలో ఇలాంటి పాట పెట్టడం ఏంటంటూ ట్రోల్స్ చేస్తున్నారు.
రిలీజైన ఆ సాంగ్ చూస్తే మహేష్ మాస్ స్టెప్స్ థియేటర్ లో ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా ఉంది. శ్రీలీల కూడా మహేష్ మాస్ స్టెప్స్ కి అదరగొట్టే డ్యాన్స్ మూమెంట్స్ తో అలరించింది. సోషల్ మీడియాలో ఒకతను చేసిన కుర్చి మడతపెట్టి అంటూ చేసిన ఒక వీడియో వైరల్ అవ్వడం దాని మీద సాంగ్ చేయడం సినిమాల మీద సోషల్ మీడియా ప్రభావం ఏ రేంజ్ లో ఉందో అర్ధమవుతుంది.
Also Read : Dunki: కొన్నిసార్లు అంచనాలకు భయపడతా: డంకీ డైరెక్టర్ రాజ్ కుమార్