Mahesh Babu : మహేష్ బాబు గనుక ఆ సినిమా చేసి ఉంటె మరో డిజాస్టర్ పడేది !!
Mahesh Babu : మహేష్ బాబు డెబ్యూ మూవీ 'రాజకుమారుడు' బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత, ఆయనతో సినిమాలు చేసేందుకు అగ్ర దర్శకులు, నిర్మాతలు క్యూ కట్టారు
- By Sudheer Published Date - 04:57 PM, Sat - 2 August 25

సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో రిజెక్ట్ చేసిన కథతో మరో హీరో సినిమా చేయడం సర్వసాధారణం. అలా వచ్చి బ్లాక్‌బస్టర్ అయిన సినిమాలున్నాయి, అలాగే ఫ్లాప్ అయినవి కూడా ఉన్నాయి. కథల ఎంపికలో కొందరు స్టార్ల అంచనాలు కరెక్ట్ అయితే, మరికొందరివి తప్పుతాయి. అటువంటి ఒక ఆసక్తికర సందర్భం మహేష్ బాబు (Mahesh Babu) మరియు నాగార్జున కెరీర్‌లలో జరిగింది. మహేష్ బాబు డెబ్యూ మూవీ ‘రాజకుమారుడు’ బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత, ఆయనతో సినిమాలు చేసేందుకు అగ్ర దర్శకులు, నిర్మాతలు క్యూ కట్టారు. ఆ సమయంలోనే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కె.ఎస్. రవికుమార్ మహేష్ బాబు కోసం ఒక స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు.
కె.ఎస్. రవికుమార్ చెప్పిన కథకు మహేష్ బాబు ఓకే చెప్పడంతో, నిర్మాత ఎం. అర్జున రాజు ఆ సినిమాను అధికారికంగా ప్రకటించారు. అప్పటికి మహేష్ బాబు ‘యువరాజు’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ‘యువరాజు’ తర్వాత కె.ఎస్. రవికుమార్ సినిమాను సెట్స్‌పైకి తీసుకురావాలని నిర్మాత భావించారు. అయితే ‘యువరాజు’ బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడంతో మహేష్ బాబు కె.ఎస్. రవికుమార్ సినిమాను పక్కన పెట్టేశారు. ‘యువరాజు’ మూవీలో పెళ్లైన యువకుడిగా మహేష్ బాబును ప్రేక్షకులు అంగీకరించలేకపోయారు. కె.ఎస్. రవికుమార్ సినిమాలో కూడా అలాంటి పాత్రే తనది కావడంతో, మరోసారి రిస్క్ తీసుకోవడం ఎందుకని భావించి మహేష్ ఆ సినిమాను రిజెక్ట్ చేశారు.
Garuda Purana : స్వర్గం.. నరకం ఉంటాయా?.. మోక్షం ఉంటుందా? ..విజ్ఞానానికి సవాలుగా మారిన పురాతన రహస్యం!
మహేష్ బాబు రిజెక్ట్ చేసిన ఆ కథతోనే నాగార్జున హీరోగా కె.ఎస్. రవికుమార్ సినిమాను మొదలుపెట్టారు. ఆ సినిమానే ‘బావ నచ్చాడు’ (Bava Nachadu). మహేష్ బాబు కోసం అనుకున్న నిర్మాత, టెక్నీషియన్లతోనే ‘బావ నచ్చాడు’ రూపొందింది. ఈ మూవీలో నాగార్జునకు జోడీగా సిమ్రాన్, రీమా సేన్ హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాలతో విడుదలైన ‘బావ నచ్చాడు’ బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. నాగార్జున కెరీర్‌లోనే వరెస్ట్ మూవీ అంటూ అభిమానులు ‘బావ నచ్చాడు’పై దారుణంగా విమర్శలు కురిపించారు. ‘బావ నచ్చాడు’ విషయంలో మహేష్ బాబు జడ్జ్‌మెంట్ కరెక్ట్‌గా నిరూపితం కాగా, నాగార్జున అంచనాలు తప్పుగా మారాయి.
ప్రస్తుతం మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli)తో ఓ అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ (SSMB29) చేస్తున్నారు. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, మాధవన్, పృథ్వీరాజ్ సుకుమారన్‌తో పాటు పలువురు దక్షిణాది నటీనటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. మరోవైపు, కింగ్ అక్కినేని నాగార్జున సూపర్ స్టార్ రజనీకాంత్ ‘కూలీ’ మూవీలో విలన్‌గా నటించారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కాబోతోంది. ఈ సినిమాలో ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, సౌబీన్ షాహిర్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.