Mahesh Babu Guntur Karam OTT Release : గుంటూరు కారం పాన్ ఇండియా రిలీజ్.. ఓటీటీలో భలే ట్విస్ట్ ఇచ్చారుగా..!
Mahesh Babu Guntur Karam OTT Release సూపర్ స్టార్ మహేష్ త్రివిక్రం డైరెక్షన్ లో వచ్చిన గుంటూరు సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజైంది. మొదట సినిమాపై డివైడ్ టాక్ వచ్చినా మహేష్ స్టామినాతో
- By Ramesh Published Date - 08:53 PM, Fri - 9 February 24

Mahesh Babu Guntur Karam OTT Release సూపర్ స్టార్ మహేష్ త్రివిక్రం డైరెక్షన్ లో వచ్చిన గుంటూరు సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజైంది. మొదట సినిమాపై డివైడ్ టాక్ వచ్చినా మహేష్ స్టామినాతో సినిమాను నిలబెట్టాడు. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కూడా నటించింది. థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని సాంగ్స్ కూడా సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని మెప్పించాయి.
థియేట్రికల్ రన్ పూర్తైన గుంటూరు కారం సినిమా ఓటీటీలో రిలీజైంది. ఈరోజు నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన గుంటూరు కారం సినిమా ఆడియన్స్ ని షాక్ ఇస్తూ తెలుగుతో పాటు అన్ని భాషల్లో అందుబాటులోకి తెచ్చింది. గుంటూరు కారం కేవలం తెలుగు లోనే రిలీజ్ కాగా అదే ఓటీటీలో వస్తుందని అనుకున్నారు.
కానీ ఓటీటీలో మాత్రం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మళయాళ భాషలతో పాటుగా హిందీలో కూడా అందుబాటులోకి తెచ్చారు. సో ఓటీటీలో ఇది పాన్ ఇండియా సినిమా గా రిలీజ్ చేశారు. మరి ఈ ట్విస్ట్ మాత్రం సూపర్ స్టార్ ఫ్యాన్స్ అసలు ఊహించలేదు.
గుంటూరు కారం సినిమా బాక్సాఫీస్ దగ్గర 200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ రాజమౌలి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఆ సినిమాకు కావాల్సిన మేకోవర్ పనిలో ఉన్నట్టు తెలుస్తుంది.