Mahesh Babu: ఇటలీ టూర్ లో మహేశ్.. ఫ్యామిలీ ఫొటో వైరల్!
మహేశ్ బాబు ఫ్యామిలీ మ్యాన్ అని మరోసారి నిరూపించుకున్నాడు.
- By Balu J Published Date - 01:12 PM, Mon - 13 June 22
మహేశ్ బాబు ఫ్యామిలీ మ్యాన్ అని మరోసారి నిరూపించుకున్నాడు. ఆయనకు ఏమాత్రం సమయం దొరికినా ఫ్యామిలీతో గడపడానికి ఆసక్తి చూపుతుంటాడు. ఫ్యామిలీతో సహ వెకేషన్స్ కు వెళ్తూ చిల్ అవుతుంటాడు. ప్రస్తుతం మహేశ్ సమ్మర్ వెకేషన్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఆయన సోమవారం ఇండియాకు తరిగిరావాల్సి ఉంది. ఐరోపాలో మహేశ్ సెలవుల్లో భాగంగా ఇటలీకి వెళ్తున్నాడు. యూరప్‌లోని రోడ్ ట్రిప్ ఫోటోను ఒకటిని షేర్ చేశారు.
ఫ్యామిలీతో ఇటలీకి వెళ్తున్నా అంటూ ఇన్ స్టాలో వెల్లడించాడు. భార్య, కొడుకు, కూతురుతో కలిసి సెల్ఫీ దిగాడు. ఈ ఫొటోలో మహేష్ బాబు చాలా అందంగా కనిపిస్తున్నాడు. “రోడ్ ట్రిప్ ఇట్స్!! నెక్స్ట్ స్టాప్ ఇటలీ!! లంచ్ విత్ ది క్రేజీస్” అని రాశాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించబోయే మహేశ్ మూవీ ఆలస్యం అవుతోంది. త్రివిక్రమ్ ఇటీవలే జర్మనీలో మహేష్ బాబుని కలుసుకుని ఫైనల్ స్క్రిప్ట్‌ని చెప్పాడు. జూలై చివర్లో లేదా ఆగస్టులో రెగ్యులర్ షూట్ మొదలయ్యే అవకాశం ఉంది.