Mahesh Babu: చంద్రబాబు, పవన్ గెలుపుపై మహేశ్ అదిరే ట్వీట్
- By Balu J Published Date - 12:28 AM, Thu - 6 June 24

Mahesh Babu: సినీ ప్రముఖులు నారా చంద్రబాబు నాయుడికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తన ట్విట్టర్ ఖాతాలో శుభాకాంక్షలు తెలియజేశారు. మహేష్ బాబు రియాక్ట్ అవుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఘన విజయం సాధించిన నారా చంద్రబాబు నాయుడికి హృదయపూర్వక అభినందనలు. ఏపీ అభివృద్ధి, శ్రేయస్సుతో నిండిన పదవీకాలం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
అంతేగాక, అద్భుతమైన విజయం సాధించినందుకు అభినందనలు పవన్ కల్యాణ్ అని ట్వీట్ చేశారు. మీ విజయం ప్రజలు మీపై ఉంచిన నమ్మకానికి ప్రతిబింబం. ప్రజల కోసం మీ కలలను సాకారం చేయడంలో మీరు విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. నిన్నటి నుండి ఈ ట్వీట్ టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు, మహేష్ బాబు అభిమానులు ఇద్దరూ సెలబ్రేషన్ మోడ్ లో ఉన్నారు.