Veera Simha Reddy: ‘మా బావ మనోభవాలు’ సాంగ్ రిలీజ్.. బాలయ్య మాస్ డాన్స్ అదుర్స్!
వీరసింహారెడ్డి నుంచి మూడో సాంగ్ రిలీజ్ అయ్యింది. (Balakrishna) మాస్ స్టెప్పులతో ఉర్రూతలూగించాడు.
- Author : Balu J
Date : 24-12-2022 - 4:01 IST
Published By : Hashtagu Telugu Desk
గోపీచంద్ మలినేని (Gopichand) దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం వీరసింహారెడ్డి (Veera Simha Reddy). ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ సినిమా బాలయ్య మరో పవర్ ఫుల్ మాస్ అవతార్ లో కనిపించనున్నాడు. ఇప్పటివరకు విడుదలైన ప్రోమోలు, గ్లింప్స్ ఈ చిత్రం పూర్తి మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని తెలియజేస్తున్నాయి. బాలకృష్ణ మాస్ ఇమేజ్, ఎనర్జీకి సరిపోయేలా, థమన్ మాస్ అంశాలు ఉండేలా మ్యూజిక్ అందించాడు. బాలయ్య కోసం మాస్ బీట్స్ తో కూడిన మ్యూజిక్ ఆల్బమ్స్ ను చేశాడు.
వీరసింహారెడ్డి, జై బాలయ్య, సుగుణ సుందరిలోని మొదటి రెండు పాటలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. ఈ రోజు మేకర్స్ మూడో సింగిల్ (Maa Bava Manobhavalu)ను విడుదల చేశారు. వీరసింహారెడ్డిలోని మూడో పాట మా బావ మనోభవాలు (Maa Bava Manobhavalu) రిలీజ్ అయి బాలయ్య అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. బాలయ్య మాస్ (Mass) ఎనర్జిటిక్ డ్యాన్స్ ఆకట్టుకుంటోంది. ఈ పాటకు విడుదలైన కొద్ది నిమిషాల్లోనూ మంచి రెస్పాన్స్ వస్తోంది.
పాటలోని ప్రత్యేకతలు
మా బావ మనోభావాలు (Maa Bava Manobhavalu) హుక్ స్టెప్
బాలకృష్ణ, హనీ రోజ్ స్క్రీన్ కెమిస్ట్రీ
బాలయ్య లలిత నృత్యం
శేఖర్ కొరియోగ్రఫీ
థమన్ పర్ఫెక్ట్ మాస్ కంపోజిషన్