HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Looks Young Even At The Age Of 40 Fitness Secret Of Trisha

Trisha Krishnan: త్రిష గ్లామర్ సీక్రెట్ ఏంటో కానీ.. నలభైలోనూ వన్నె తరగని అందం!

 పొన్నియిన్ సెల్వన్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అందరి కళ్ళు త్రిష మీదే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.

  • Author : Balu J Date : 25-04-2023 - 12:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Trisha
Trisha

హీరోయిన్ త్రిష (Trisha) సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పాపులర్ నటి. ఈ బ్యూటీ 40లోకి అడుగుపెట్టినా వన్నె తరగని అందంతో ప్రేక్షకులు ఎంటటైన్ చేస్తోంది. శరీరాకృతిని కాపాడుకోవడానికి రెగ్యులర్ వర్కవుట్‌లు చేస్తోంది త్రిష. డార్లింగ్ ప్రభాస్ పక్కన హీరోయిన్ నటించిన వర్షం సినిమాలో ఎలా ఉందో, ఇప్పటికే అదే అందంతో ఆకట్టుకుంటోంది. దాదాపు ఒకటిన్నర దశాబ్దాల వ్యవధిలో ఒకే ఫిగర్‌ని కాపాడుకోవడం కష్టం. ఎవర్ గ్రీన్ లా మెరిసిపోతున్న ఈ బ్యూటీ సీక్రెట్స్ ఎంటో తెలుసా..

మాములుగా హీరోయిన్లు ఎంత స్టార్ డం చూసినా కెరీర్ మహా అయితే పది పదిహేను సంవత్సరాలకు మించి ఉండదు. హీరోలు అరవై దాటినా డ్యూయెట్లు పాడుకోవచ్చు కానీ బ్యూటీస్ కి ఆ ఛాన్స్ దొరకదు. ఆ వయసు వచ్చేసరికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయి వదినా అక్క అత్తయ్య అంటూ పిలిపించుకోవాల్సిందే. రోజా, రమ్యకృష్ణ, ఇంద్రజ, ఆమని, మధుబాల ఇలా చెప్పుకుంటూ పొతే లిస్టు చాలా పెద్దది ఉంటుంది. ముప్పై అయిదు వచ్చేనాటికే వీళ్లంతా ఫామ్ తగ్గిపోయి పాత్రల ఎంపికలో రూటు మార్చుకున్నారు. కానీ త్రిష మాత్రం తాను చాలా స్పెషలని రుజువు చేస్తోంది

పొన్నియిన్ సెల్వన్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అందరి కళ్ళు త్రిష మీదే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. తనకంటే చాలా చిన్నవాళ్ళైన శోభిత ధూళిపాళ, ఐశ్వర్య లక్ష్మిల మీద దృష్టి పెద్దగా లేదు. నాలుగు పదుల వయసుకి నెలల దూరంలో ఉన్న త్రిష గ్లామర్ సీక్రెట్ ఏంటో కానీ స్టేజి మీద విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్ ఇలా అందరూ తనని ప్రత్యేకంగా ప్రశంసలతో ముంచెత్తడం విశేషం.

బ్యూటీ సీక్రెట్స్ ఇవే

మేకప్ లేకుండా కూడా త్రిష (Trisha) అద్భుతంగా ఉంటుంది.  కేవలం కోల్, లైనర్, లైట్ లిప్‌స్టిక్ వేసుకుంటుంది. త్రిష కంప్లీట్ గా కెమికల్ ఫుడ్ దూరంగా ఉంటుంది. తాజా పండ్లు, వెజిటేబుల్స్ తినడానికి ఇష్టపడుతుంది. ఎక్కువ విటమిన్-సి ఆహారాన్ని తినడానికి ప్రాధాన్యం ఇస్తుంది. ఇక రోజువారీ మెనూలో నారింజ, ఇతర సిట్రస్ పండ్లు కచ్చితంగా ఉంటాయి. త్రిష ఒక కప్పు గ్రీన్ టీతో రోజువారి జీవితాన్ని ప్రారంభిస్తుంది. కెఫిన్ కలిగిన పానీయాలను పూర్తిగా మానేసింది. ఎక్కువ నీరు తాగడం వల్ల చర్మాన్ని తాజాగా ఉంచుతుందని నమ్ముతుంది. స్వచ్ఛమైన నీరు (Water) లేదా పండ్ల రసాలు వంటి ద్రవం తీసుకోవడం ఆమె ఎప్పటికీ మర్చిపోదు.

త్రిష ప్రతిరోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ (Breakfast) కచ్చితంగా తీసుకుంటుంది, భోజనాల మధ్య మంచింగ్‌ను దూరం పెడుతుంది. ఆమె తన అల్పాహారంలో ఎక్కువగా పరాటాలు, ఆమ్లెట్లు, పెరుగు ఎక్కువగా ఉండేలా చూసుకుంటుంది. త్రిష తనకు ఇష్టమైన ఆహారాన్ని ఎప్పుడూ అడ్డుకోనని, అయితే తనకు నచ్చినవన్నీ తక్కువ పరిమాణంలో తింటానని చెప్పింది. ఆమెకు ఇష్టమైనవి సీఫుడ్. ఆరోగ్యం, అందాన్ని కాపాడుకోవడానికి నిద్ర కూడా కారణం. క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అనుసరిస్తుంది.

త్రిష (Trisha) కొన్ని యోగా వ్యాయామాలతో తన రోజును ప్రారంభించడం తనకు ఇష్టమని, అదే తన యవ్వనంగా కనిపించే చర్మాన్ని, ఫిగర్‌ని మెయింటెయిన్ చేసే రహస్యమని ఆమె చెప్పింది. యోగా తన మనస్సును రోజంతా ప్రశాంతంగా ఉంచుతుందని, ఒత్తిడిని అధిగమించడానికి మరియు జీవక్రియను మెరుగుపరచడానికి ఇది ఒక సాధారణ టెక్నిక్ అని ఆమె చెప్పింది.

Also Read: Payal Bold Look: పాయల్ బోల్డ్ లుక్.. జడలో మల్లెపూలు, ఒంటి మీద ఒక్క నూలుపోగు లేకుండా!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Glammer
  • latest tollywood news
  • Ponniyin Selvan 2
  • Trisha Krishnan

Related News

Trisha is a parasite... Suchitra makes sensational allegations.

Singer Suchitra: త్రిష ఓ పరాన్నజీవి… సుచిత్ర సంచలన ఆరోపణలు..

తమిళనాడులో సినీ నటి త్రిష ఇప్పుడు టాప్ ట్రెండింగ్ లో ఉన్నారు. సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత త్రిష గురించి చర్చ మరింత పెరిగింది. పాలిటిక్స్ లో ఆమె కీలకపాత్ర పోషించే అవకాశం ఉందనేది పలువురి అభిప్రాయం. విజయ్, త్రిష వ్యక్తిగతంగా చాలా సన్నిహితంగా ఉన్నారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. మరోవైపు, త్రిషపై గాయని సుచిత్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ ప్రస్తుతం తన కుటు

  • Trisha Krishnan

    Trisha: ప్రేమ‌కు కృత‌జ్ఞ‌త‌లు.. త్రిష పోస్ట్ వైరల్..!

  • cm vijay with trisha

    TVK Vijay: సీఎం‌గా దళపతి విజయ్ ప్రమాణస్వీకారం… హాజరైన ప్రముఖులు

  • Trisha Krishnan

    Trisha: విజయ్ ప్రమాణ స్వీకారానికి త్రిష..

  • Venu Swamy Prediction on Vijay

    Venu Swamy: విజయ్-త్రిషపై వేణుస్వామి షాకింగ్ కామెంట్స్

Latest News

  • POCSO Case: బండి భ‌గీర‌థ్‌ కేసుపై సీఎం రేవంత్ సీరియస్

  • Gold: ప్రధాని మోదీ ప్రకటనతో కుప్పకూలిన గోల్డ్ స్టాక్స్

  • Tanikella Bharani: మోదీపై తనికెళ్ల భరణి ఎమోషనల్ పోస్ట్

  • Tamil Nadu Politics: విజయ్ కేబినెట్‌ మంత్రి జేబులో జయలలిత ఫోటో

  • Somnath Temple: సోమనాథ్ అమృత్ మహోత్సవంలో ప్రధాని మోదీ

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd