Face to Face : లైగర్ వర్సెస్ లెజెండ్.. బాక్సింగ్ రింగ్ లో కింగ్ ఎవరో!
బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ LIGER (సాలా క్రాస్‌బ్రీడ్)తో తొలిసారిగా ఇండియన్ స్రీన్ పై కనిపించబోతున్నాడు.
- By Balu J Published Date - 11:42 AM, Tue - 16 November 21

బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ LIGER (సాలా క్రాస్‌బ్రీడ్)తో తొలిసారిగా ఇండియన్ స్రీన్ పై కనిపించబోతున్నాడు. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ మూవీకి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎన్నో అంచనాలను రేపుతోంది. ఈ చిత్రంలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే టైసన్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్సాన్ప్ వచ్చింది. విజయ్, టైసన్ కాంబినేషన్ లో ఎప్పుడు సినిమా మొదలవుతుందా? అని ఆసక్తి ఎదరుచూస్తున్నారు.
అభిమానుల నిరీక్షణకు తెగదింపుతూ టైసన్ సెట్స్ లోకి అడుగుపెట్టనున్నాడు. మైక్ టైసన్, లైగర్ విజయ్ దేవరకొండ పాల్గొన్న కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి టీమ్ ప్రస్తుతం USA లో ఉంది. ఈరోజు షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కాగా, ఈ ముఖ్యమైన సన్నివేశాలను గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు. ఇద్దరూ హైఓల్టేజ్ పాత్రలు పోషిస్తున్నందున, వారి షెడ్యూల్ చిత్రీకరించడానికి పూరీ రెడీ అవుతున్నాడు. ఇక ఢీ అంటే ఢీ అనేలా విజయ్, టైసన్ రంగంలోకి దిగబోతున్నారు.
ఇది అత్యంత క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లలో ఒకటి. గ్రేట్ మైక్ టైసన్ కీరోల్ వహిస్తున్నందున అంచనాలు మరింతగా పెరిగాయి. పూరి కనెక్ట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ అందించగా, థాయ్‌లాండ్‌కు చెందిన కెచా స్టంట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతున్న లిగర్‌లో రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లైగర్ షూటింగ్ చివరి దశలో ఉంది. వచ్చే ఏడాదిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
తారాగణం: విజయ్ దేవరకొండ, అనన్య పాండే, రమ్య కృష్ణన్, రోనిత్ రాయ్, విషు రెడ్డి, అలీ, మకరంద్ దేశ్ పాండే మరియు గెటప్ శ్రీను.
దర్శకుడు: పూరి జగన్నాధ్
నిర్మాతలు: పూరి జగన్నాధ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహార్ మరియు అపూర్వ మెహతా
బ్యానర్లు: పూరి కనెక్ట్స్ మరియు ధర్మ ప్రొడక్షన్స్
DOP: విష్ణు శర్మ
ఆర్ట్ డైరెక్టర్: జానీ షేక్ బాషా
ఎడిటర్: జునైద్ సిద్ధిఖీ
స్టంట్ డైరెక్టర్: కేచ
Related News

Vijay Devarakonda : రెండు భాగాలుగా విజయ్ దేవరకొండ సినిమా..?
ఖుషి తర్వాత విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) చేస్తున్న రెండు సినిమాలు భారీ అంచనాలతో వస్తున్నాయి.