Lawrence : కాళ్లకి నమస్కారం చేసిన లారెన్స్
లారెన్స్ మాట్లాడుతుండగా ఓ అభిమాని వేదికపైకి వచ్చి రాఘవ కాళ్లపై పడడానికి ట్రై చేసాడు. ఏంటమ్మా' అని అడిగి కాళ్లపై పడుతుంటే.. వద్దు వద్దని.. తిరిగి తన అభిమాని కాళ్లకి నమస్కారం చేశారు లారెన్స్
- Author : Sudheer
Date : 05-11-2023 - 4:00 IST
Published By : Hashtagu Telugu Desk
సినిమా ఫంక్షన్ లలో హీరోల కాళ్లపై అభిమానులు పడి , నమస్కారం చేస్తుంటారు..కానీ ఇక్కడ మాత్రం అభిమాని కాళ్లకు నమస్కారం చేసి వార్తల్లో నిలిచారు రాఘవ లారెన్స్ (Raghava Lawrence) . డాన్స్ మాస్టర్ గా చిత్రసీమలో అడుగుపెట్టిన రాఘవ..ఆ తర్వాత యాక్టర్ , డైరెక్టర్ , ప్రొడ్యూసర్ , మ్యూజిక్ డైరెక్టర్ ఇలా అనేక రంగాలలో రాణిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. రీసెంట్ గా చంద్రముఖి 2 (Chandramukhi 2)తో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ , ఆ చిత్రం పెద్దగా ప్రేక్షకులను అలరింపజేయలేకపోయింది.
We’re now on WhatsApp. Click to Join.
ప్రస్తుతం ‘జిగర్ తండా డబుల్ ఎక్స్’ (Jigarthanda DoubleX ) మూవీ తో దీపావళి కానుకగా నవంబర్ 10 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో శనివారం అట్టహాసంగా జరిగింది. ఈ వేదికపై లారెన్స్ మాట్లాడుతుండగా ఓ అభిమాని వేదికపైకి వచ్చి రాఘవ కాళ్లపై పడడానికి ట్రై చేసాడు. ఏంటమ్మా’ అని అడిగి కాళ్లపై పడుతుంటే.. వద్దు వద్దని.. తిరిగి తన అభిమాని కాళ్లకి నమస్కారం చేశారు లారెన్స్. ఆ తరువాత అతన్ని దగ్గరకు తీసుకుని ప్రేమగా మాట్లాడి అతను చెప్పేదంతా ప్రశాంతంగా విన్నారు. బౌన్సర్లు అతనిపైకి దూసుకొస్తుండగా.. ఆగండి అని ఆపేసి ప్రేమగా లారెన్స్ తన అభిమానిని గుండెలకు హత్తుకుని అతను చెప్పేదంతా విన్నారు. ఆ తరువాత ఆ అబ్బాయి చెప్పిన దాన్ని అందరికీ చెప్పుకొచ్చాడు లారెన్స్, నేను మా అమ్మకి గుడికట్టాను కదా ఆ ప్రేరణతో ఈ అబ్బాయి తన గుండెలపై తల్లి పచ్చబొట్టుని పొడిపించున్నాడట అంటూ అతని గుండెలపై ఉన్న అమ్మ పచ్చబొట్టుని అందరికీ చూపించారు లారెన్స్. చాలా సంతోషం అని అంటూ తన అభిమానిని దగ్గరకు తీసుకుని బుగ్గపై ముద్దు పెట్టారు. దీనికి సంబదించిన వీడియోస్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. రాఘవ లారెన్స్, ఎస్ జె సూర్యలు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేశారు. నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Read Also : WhatsApp Channels : వాట్సాప్ ఛానల్స్‌లో సరికొత్త ఫీచర్.. ఇదిగో