Varun Lavanya : పెళ్లి తర్వాత అత్తారింట్లో లావణ్య మొదటి దీపావళి.. ఫ్యామిలీతో కలిసి..
పెళ్లి తర్వాత ప్రస్తుతం లావణ్య ఇక్కడే హైదరాబాద్ లో అత్తారింట్లోనే ఉంటుంది. ఇటీవలే నిహారిక(Niharika) కొత్త సినిమా ఓపెనింగ్ కి వీరిద్దరూ కలిసి మొదటిసారి బయటకి వచ్చారు.
- By News Desk Published Date - 03:42 PM, Mon - 13 November 23

మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej), హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) ఇటీవలే గ్రాండ్ గా ఇటలీలో ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు అందరి కళ్ళు ఈ కొత్త జంటపైనే ఉన్నాయి. వీరిద్దరూ ఎక్కడ కనపడినా వైరల్ అవుతున్నారు. వీరి ఫోటోల కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.
పెళ్లి తర్వాత ప్రస్తుతం లావణ్య ఇక్కడే హైదరాబాద్ లో అత్తారింట్లోనే ఉంటుంది. ఇటీవలే నిహారిక(Niharika) కొత్త సినిమా ఓపెనింగ్ కి వీరిద్దరూ కలిసి మొదటిసారి బయటకి వచ్చారు. ఇక నిన్న దీపావళి కావడంతో లావణ్య అత్తారింట్లోనే తొలి దీపావళి సెలెబ్రేట్ చేసుకుంది.

వరుణ్ లావణ్య తమ ఫ్యామిలీతో కలిసి దీపావళిని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నారు. దీపావళి స్పెషల్ ఫోటోలు తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు ఈ జంట. ఈ ఫొటోలో వరుణ్, లావణ్య, నిహారిక, నాగబాబు, నాగబాబు భార్య.. ఇలా ఫ్యామిలీ మొత్తం ఉన్నారు. దీంతో వరుణ్ లావణ్య మొదటి దీపావళి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Also Read : Samantha : బాత్ టబ్‌లో ఫొటో షేర్ చేసిన సమంత.. భూటాన్‌లో ఫుల్ ఎంజాయ్..