Kushi Censor : ఖుషి సెన్సార్ టాక్
సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసారు
- By Sudheer Published Date - 12:54 PM, Wed - 23 August 23
యూత్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) – సమంత (Samantha ) జంటగా మజిలీ ఫేమ్ శివ నిర్వాణ (Shiva Nirvana) డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ ఖుషి (Kushi). మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మించిన ఈ మూవీ లో జయరాం, మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 1వ తేదీన తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషలలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాలోని సాంగ్స్ చార్ట్ బస్టర్ గా నిలిచాయి. ఒకదానిని మించి మరోటి హిట్ అయ్యాయి. ఈ పాటలతోనే సినిమా సగం హిట్ అయ్యింది. విడుదల సమయం దగ్గర పడుతుండడం తో చిత్ర యూనిట్ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసారు.
సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు సినిమాకు యూ/ఏ (Kushi Censor U/A) సర్టిఫికెట్ జారీ చేసారు. సినిమా చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెపుతున్నారు. విజయ్ – సమంతల మధ్య కెమిస్ట్రీ యూత్ ను మాయ చేస్తుందని అంటున్నారు. సాంగ్స్ వినడానికే కాదు చూడడానికి కూడా ఎంతో బాగున్నాయని అంటున్నారు. డైరెక్టర్ శివ మరోసారి యూత్ ఫుల్ స్టోరీ తో అలరించడం ఖాయం అంటున్నారు. సమంత యాక్టింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదని , తన నటనతోనే కాదు తన గ్లామర్ తో మరోసారి యూత్ ను కట్టిపడేయడం ఖాయం అంటున్నారు. హిషామ్ అబ్దుల్ వాహబ్ మ్యూజిక్ సినిమాకు ప్రాణం పోసిందని అంటున్నారు. జి మురళి సినిమా ఫొటోగ్రఫీ ఎంతో కలర్ ఫుల్ గా ఉందని , మైత్రి మూవీ మేకర్స్ ఎక్కడ తగ్గకుండా భారీగా ఖర్చు చేసి సినిమా ను చాల రిచ్ గా నిర్మించారని అంటున్నారు. ఓవరాల్ గా ఖుషి అందర్నీ ఖుషి చేయడం పక్క అంటున్నారు.
Read Also : Chandrayaan 3 Vikram Lander : భారీ సవాళ్ల మధ్య విక్రం ల్యాండింగ్
Related News
Samantha : హమ్మయ్య మళ్ళీ సినిమాలు మొదలుపెట్టిన సమంత.. బర్త్ డే రోజు రీ ఎంట్రీ సినిమా అనౌన్స్..
నేడు సమంత పుట్టిన రోజు కావడంతో అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. సమంత నెక్స్ట్ సినిమాను నేడు ప్రకటించింది.