Krishnam Raju : కనకమామిడి ఫాంహౌస్ లో సోమవారం కృష్ణంరాజు అంత్యక్రియలు..!!
ప్రముఖ సీనియర్ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో సోమవారం నిర్వహించనున్నారు.
- Author : hashtagu
Date : 11-09-2022 - 7:47 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రముఖ సీనియర్ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో సోమవారం నిర్వహించనున్నారు. సోమవారం మధ్యాహ్నం 1గంటకు మెయినాబాద్ దగ్గర కనకమామిడి ఫాంహౌస్ లో అంత్యక్రియలు జరపాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ప్రస్తుతం కృష్ణంరాజు భౌతికకాయం అభిమానుల సందర్శనార్ధం ఆయన నివాసంలో ఉంచారు. సోమవారం మధ్యాహ్నం వరకు అక్కడే ఉంటుంది. కాగా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్న నేపథ్యంలో సీసీఎ సోమేశ్ కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
Also Read : ఆ కోరిక తీరకుండానే కన్నుమూసిన కృష్ణంరాజు
కృష్ణంరాజు పార్థివేదేహాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్ తోపాటు పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ రంగ ప్రముఖలు, వేలాది మంది అభిమానులు సందర్శించి నివాళులర్పించారు.