Kotha Loka : బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తున్న ‘కొత్త లోక’
Kotha Loka : తెలుగులోనే రూ.8 కోట్ల షేర్, రూ.15 కోట్ల గ్రాస్‌ను సాధించగా, మొత్తం మీద రూ.230 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం ఆశ్చర్యకర అంశం. కేవలం రూ.30 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఇంత భారీ స్థాయిలో విజయాన్ని సాధించడం సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది
- By Sudheer Published Date - 06:10 PM, Sun - 14 September 25

మలయాళంలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన కొత్త లోక (Kotha Loka) ఇటీవల తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలలో కొంత ఆలస్యం, మధ్యలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా, థియేటర్లలోకి వచ్చిన వెంటనే ఈ చిత్రం అద్భుతమైన స్పందనను రాబట్టింది. ప్రేక్షకులు ప్రత్యేకంగా కల్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan ) సహజమైన నటనను, నటుడు నస్లెన్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌ను ప్రశంసిస్తున్నారు. హీరోయినే ప్రధానంగా నడిపించే సినిమా కావడం, అందులోనూ కథలో వినూత్నత ఉండటం ఈ చిత్రానికి బలమైన పాజిటివ్ పాయింట్లుగా మారాయి.
Pothula Sunitha : బిజెపి తీర్థం పుచ్చుకున్న మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత
సూపర్ హీరో టచ్‌తో కూడిన సరికొత్త కాన్సెప్ట్, టెక్నికల్ వర్క్, విజువల్స్, బీజీఎం ఇలా అన్ని కలిసి సినిమాను మరింత ఆకర్షణీయంగా మార్చాయి. పెద్దగా ప్రచారం లేకపోయినా, ముందుగానే బజ్ తక్కువగా ఉన్నా కూడా ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి సినిమాను ఆదరిస్తుండటం విశేషం. ఇప్పటి వరకు ఈ చిత్రం తెలుగులోనే రూ.8 కోట్ల షేర్, రూ.15 కోట్ల గ్రాస్‌ను సాధించగా, మొత్తం మీద రూ.230 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం ఆశ్చర్యకర అంశం. కేవలం రూ.30 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఇంత భారీ స్థాయిలో విజయాన్ని సాధించడం సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.
ప్రేక్షకులు సోషల్ మీడియాలో ఈ చిత్రాన్ని ప్రశంసిస్తూ, “ఇలాంటి కొత్త కాన్సెప్ట్ సినిమాలు తరచుగా రావాలి” అని అంటున్నారు. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం రాబోయే రోజుల్లో కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బలమైన రన్ ఇవ్వనుంది. వర్క్‌డేస్‌లో కూడా కలెక్షన్లు స్ట్రాంగ్‌గా ఉంటాయని అంచనా. మొత్తానికి, డామినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన కొత్త లోక తెలుగు మార్కెట్లో కూడా సూపర్ హిట్‌గా నిలిచి, ఈ ఏడాది డబ్బింగ్ సినిమాల్లో అగ్రస్థానంలో నిలిచే అవకాశం పక్కా అని చెప్పవచ్చు.