Kiraak RP: నెల్లూరు చేపల పులుసు చాలా కాస్ట్‌లీ అంటూ వార్తలు.. విమర్శలపై స్పందించిన ఆర్పీ?
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ లో ఎన్నో స్కిట్ లు చేసి ప్రేక
- By Anshu Published Date - 09:00 AM, Sat - 3 February 24

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ లో ఎన్నో స్కిట్ లు చేసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. అంతేకాకుండా జబర్దస్త్ షో ద్వారా విపరీతమైన పాపులారిటీని సంపాదించుకున్నాడు. అయితే జబర్దస్త్ లో కొన్నిఏళ్ళ పాటు తనదైన శైలిలో కామెడీ చేసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన కిరాక్ ఆర్పి ఆ తరువాత నెమ్మదిగా జబర్దస్త్ కి దూరం అయిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం కిరాక్ ఆర్పీ కామెడీ షోలకు గుడ్ బాయ్ చెప్పేసి బిజినెస్ లో సక్సెస్ ఫుల్ గా రాణిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో హైదరాబాదులో ఒక కర్రీ పాయింట్ ప్రారంభించిన విషయం తెలిసిందే.
అయితే కిరాక్ ఆర్పి ఊహించిన దాని కంటే ఎక్కువ స్థాయిలో కస్టమర్స్ రావడంతో కొద్దీ రోజుల పాటు బిజీనెస్ ని ఆపేసిన కిరాక్ ఆర్పి ఆ తరువాత మళ్ళీ రెండు మూడు బ్రాంచ్ లు ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. దాంతో కిర్రాక్ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు బిజినెస్ ని రాష్ట్రం నలుమూలల వ్యాప్తి చెందింది. ఇది ఇలా ఉంటే ఇంకా గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో కిరాక్ ఆర్మీ చేపల పులుసు చాలా కాస్ట్లీ అమౌంట్ ఎక్కువ అంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా వార్తలపై కిరాక్ ఆర్పి స్పందించారు. ఈ మేరకు కిరాక్ ఆర్పీ మాట్లాడుతూ.. కిలో చికెన్ కొంటే కిలో చేతిక వస్తుంది. మటన్ కూడా అంతే. కానీ కిలో చేప తీసుకుంటే మాత్రం కిలో రాదు. తల కాయ, తోకా పోతాయి. మధ్యలో ఉండే పీసులే నేను అమ్మాలి. ఇతర కూరల్లో వేసిన దానికి వంద రెట్లు ఎక్కువగా చేపల కూరలో నూనే వేయాలి.
రుచి కోసం మామిడి కాయలు కూడా జత చేయాలి. అవి కూడా చాలా రేట్లు పలుకుతున్నాయి. ఇవొక్కటే కాదు.. ధనియాలు, జీలకర్ర, మెంతులు ఆఖరిలో వేసే మసాలా, కొత్తిమీర ఇలా చేపల కర్రీకి ఉపయోగించే పదార్థాల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటికి తగ్గట్టుగానే నా కర్రీపాయింట్‌లో ధరలు ఉన్నాయి. ఎవరూ కూడా కావాలని అత్యధిక రేట్లు పెట్టరు. రేట్లు ఎక్కువ పెట్టడం వల్ల వ్యాపారం జరగదు అని తెలిసినప్పుడు నేను రేట్లు ఎందుకు ఎక్కువ పెడతాను. ఇది మామూలు రిస్కీ బిజినెస్ కాదు. నేను కూడా నాసిరకమైన చేపలు తెచ్చి అల్లం పేస్ట్ కలిపి ఊరికే కూడా ఇస్తాను. మీరు మంచి చేపలు తిని బాగుండాలని కోరుకుంటున్నా కాబట్టి రేట్లు అలా పెట్టవలసి వస్తుంది అంటూ నెల్లూరు పెద్దా రెడ్డి చేపల పులుసు రేట్లపై వస్తున్న విమర్శలపై స్పందించారు కిర్రాక్ ఆర్పీ.