Keerthy Suresh Gifts: దటీజ్ మహానటి.. చిత్ర యూనిట్ కు గోల్డ్ కాయిన్స్ గిఫ్ట్!
కీర్తి సురేశ్ దసరా యూనిట్ సభ్యులందరినీ 2 గ్రాముల బంగారు నాణేలు (Gold Coins) పంచి మహానటి అనిపించుకుంది.
- Author : Balu J
Date : 20-01-2023 - 3:46 IST
Published By : Hashtagu Telugu Desk
“మహానటి” ఫేం కీర్తి సురేశ్ (Keerthy Suresh) తన మానవత్వాన్ని చాటుకుంది. చాలా మంది హీరోయిన్స్ మాదిరిగా కాకుండా కీర్తి సురేశ్ (Keerthy Suresh) చిత్ర యూనిట్ తో సరదాగా ఉంటుంది. వాళ్లకు ప్రేమతో తనవంతు సాయం చేసింది. ఇటీవల తన లేటెస్ట్ మూవీ “దసరా” (Dasara) షూటింగ్ చివరి రోజున కీర్తి ఊహించనివిధంగా బహుమతులు (Gifts) అందించింది. యూనిట్ సభ్యులందరినీ 2 గ్రాముల బంగారు నాణేలు (Gold Coins) పంచి మహానటి అనిపించుకుంది. మొత్తం విలువ సుమారు ఆరున్నర లక్షల రూపాయలు.
కీర్తికి ఈ ఉదారత కొత్త కాదు.. ఆమె గతంలో “మహానటి” యూనిట్ సభ్యులకు ఇదే విధంగా బహుమతిగా ఇచ్చింది. యూనిట్‌తో (Movie Team) తనకు ప్రత్యేకమైన అనుబంధం అనిపించినప్పుడు, సినిమాతో ప్రయాణం గొప్ప సాగినప్పుడు మాత్రమే కీర్తి బహుమతులను పంచుతుంది. దాదాపు 65 కోట్ల బడ్జెట్‌తో కొత్త దర్శకుడితో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం “దసరా”. సింగరేణి నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇప్పటికే కీర్తి (Keerthy Suresh), నాని లుక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
Also Read: Divi Pics: బ్లాక్ డ్రస్సులో ‘దివి’ బ్లాస్ట్.. నడము, నాభి అందాలతో!