Kantara OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతార.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
చిన్న సినిమాగా విడుదలై దేశమంతటా సంచలనం రేపింది కాంతార మూవీ. ఈ సినిమా బాహుబలి, పుష్ప, గాడ్ ఫాదర్ లాంటి పెద్ద సినిమాలను
- By Balu J Published Date - 05:15 PM, Thu - 17 November 22
చిన్న సినిమాగా విడుదలై దేశమంతటా సంచలనం రేపింది కాంతార మూవీ. ఈ సినిమా బాహుబలి, పుష్ప, గాడ్ ఫాదర్ లాంటి పెద్ద సినిమాలను రికార్డులను సైతం కొల్లగొట్టింది. దీంతో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. ఈ సినిమా శాటిలైట్ డీల్ లాక్ అయింది. ప్రముఖ శాటిలైట్ ఛానెల్ స్టార్ మా, కాంతార హక్కుల్ని దక్కించుకుంది. ఈ డబ్బింగ్ సినిమా హక్కులు తెలుగులో 4 కోట్ల 50 లక్షల రూపాయలకు అమ్ముడుపోయాయి. ఓ కన్నడ డబ్బింగ్ సినిమాకు తెలుగులో ఈ స్థాయిలో రేటు పలకడం విశేషం. కేజీఎఫ్ తర్వాత శాటిలైట్ లో ఈ రేటు అందుకున్న కన్నడ డబ్బింగ్ సినిమా ఇదే.
ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను చాలా రోజుల కిందటే అమెజాన్ ప్రైమ్ కు అమ్మేశారు. టోటల్ స్ట్రీమింగ్ రైట్స్ అమెజాన్ దక్కించుకుంది. ఈ సినిమా నవంబర్ 24 నుంచి అమెాజన్ ప్రైమ్‌లోకి రానుందని అంటున్నారు. దీనికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలుగు శాటిలైట్ రైట్స్ ను 7 కోట్ల రేషియోలో అమ్మాలని నిర్మాతలు భావించారు.
కానీ అంత మొత్తం రాలేదు. చివరికి నాలుగున్నర కోట్లకు డీల్ లాక్ చేశారు. ఇది కూడా పెద్ద మొత్తమే. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో తీసిన ఈ సినిమాను హోంబలే ఫిలిమ్స్ సంస్థ నిర్మించింది. తెలుగులో రిషబ్ కు ఇదే తొలి భారీ విజయం. టాలీవుడ్ లో ఈ సినిమాను గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ కంపెనీపై అల్లు అరవింద్ రిలీజ్ చేశారు. ఈ మూవీ అల్లు అరవింద్ కు భారీగా లాభాలు తెచ్చిపెట్టింది.
Related News
Tillu Square OTT: టిల్లుగాడి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఓటీటీలోకి వచ్చిన టిల్లు స్క్వేర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
Tillu Square OTT: స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, అందాల తార అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్ లో వచ్చిన డీజే టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్ రూ.125 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ తో సంచలన విజయాన్ని అందుకుంది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో సిద్ధు, అనుపమలతో పాటు నేహా శెట్టి, ప్రియాం�