Kantara Beats Baahubali 2: దుమ్మురేపుతున్న కాంతారా.. బాహుబలి-2 రికార్డులు బద్దలు!
కన్నడలో చిన్న సినిమాగా విడుదలైన రిషబ్ శెట్టి కాంతార మూవీ.. ఆ తర్వాత అన్ని భాషల్లో విడుదలైన సంచనాలను నమోదు చేస్తోంది.
- By Balu J Published Date - 04:41 PM, Sat - 5 November 22

కన్నడలో చిన్న సినిమాగా విడుదలైన రిషబ్ శెట్టి కాంతార మూవీ.. ఆ తర్వాత అన్ని భాషల్లో విడుదలైన సంచనాలను నమోదు చేస్తోంది. ఇప్పటికే ఎన్నో రికార్డులను బ్రేక్ చేసిన కాంతార మూవీ టాలీవుడ్ విడుదలై చిరు గాడ్ ఫాదర్ రికార్డ్స్ ను సైతం బద్దలు కొట్టింది. ఇక ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఇంకా దుమ్మురేపుతోంది. అయితే ఈ మూవీ బాహుబలి 2 రికార్డులను అధిగమించింది. ఈ మూవీ ఐదవ వారంలో సుమారుగా 65 కోట్లు సాధించింది. ‘బాహుబలి 2’ ఐదో వారాంతంలో రూ.23.2కోట్ల వసూళ్లను రాబట్టింది. ‘బాహుబలి 2’ ని 55శాతం మార్జిన్‌తో ‘కాంతార’ బీట్ చేసింది. ఇక ‘కాంతార’ కలెక్షన్స్ విషయానికి వస్తే.. కర్ణాటకలో రూ.140కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ.40.5కోట్లు, తమిళనాడులో రూ.5.75కోట్లు, కేరళలో రూ.8.25కోట్లు, నార్త్ ఇండియాలో రూ.51కోట్లు సాధించింది.
ఐదు వారాల రన్ తర్వాత కూడా కాంతార మూవీ అత్యధిక కలెక్షన్లు రాబడుతోంది. సినిమా కలెక్షన్లు ఎక్కడ ముగుస్తుందో చెప్పలేము. దీపావళి సెలవుల కారణంగా మరిన్ని కలెక్షన్లను సాధించింది. 300 కోట్ల మార్క్ దాటిన ఈ మూవీ రూ. 350 కోట్లకు చేరవువతోంది. ఈ ప్రాసెస్ లో పొన్నియన్ సెల్వన్‌ను అధిగమించి భారతదేశంలో ఈ సంవత్సరంలో మూడవ అతిపెద్ద గ్రాసర్‌గా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో గాడ్ ఫాదర్, తమిళంలో పొన్నియిన్ సెల్వన్ సినిమాలను రికార్డులను కొల్లగొట్టింది ఈ మూవీ.
ప్రపంచవ్యాప్తంగా కాంతారా బాక్సాఫీస్ కలెక్షన్స్
మొదటి వారం – రూ. 26.75 కోట్లు
రెండవ వారం – రూ. 37.25 కోట్లు
మూడో వారం – రూ. 75 కోట్లు
నాలుగవ వారం – రూ. 70.75 కోట్లు
5వ శుక్రవారం – రూ. 8.25 కోట్లు
5వ శనివారం – రూ. 13 కోట్లు
5వ ఆదివారం – రూ. 14.50 కోట్లు
5వ సోమవారం – రూ. 7.50 కోట్లు
5వ మంగళవారం – రూ. 9.50 కోట్లు
5వ బుధవారం – రూ. 6 కోట్లు
5వ గురువారం – రూ. 6 కోట్లు
మొత్తం – రూ. 274.50 కోట్లు