HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Kannappa Hard Drive Missing

Kannappa : కీలక హార్డ్ డిస్క్ మాయం ..విడుదలకు బ్రేక్ పడ్డట్లేనా ?

Kannappa : ఈ వ్యవహారం వెనక కుట్ర ఉందని, సినిమా విడుదలను అడ్డుకునే ఉద్దేశంతో హార్డ్ డిస్క్‌ను దొంగిలించారని విజయ్ కుమార్ ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు

  • Author : Sudheer Date : 27-05-2025 - 11:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kannappa Hard Disk
Kannappa Hard Disk

ప్రముఖ నటుడు మంచు విష్ణు (Vishnu) ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ ‘కన్నప్ప’ (Kannappa) ఆఖరి దశకు చేరుకున్న ఈ సమయంలో అనుకోని సమస్య ఎదురైంది. సినిమా విడుదలకు కొన్ని రోజులు మాత్రమే ఉండగా, చిత్రానికి సంబంధించిన ముఖ్యమైన వీఎఫ్ఎక్స్ సన్నివేశాలు ఉన్న హార్డ్ డిస్క్ మాయం (Hard Drive Missing) కావడం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై చిత్ర బృందం పోలీసులకు ఫిర్యాదు చేసింది. విజయ్ కుమార్ అనే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వివరాల్ని అందజేస్తూ నేరుగా పోలీసు స్టేషన్ కు వెళ్లి పిర్యాదు చేసాడు.

Former Wyra MLA : వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్ లాల్ కన్నుమూత

సుమారు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రంలో మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, దేవరాజ్ లాంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ముంబైలోని హెచ్ఐవీఈ స్టూడియోస్‌లో రూపొందించిన వీఎఫ్ఎక్స్ ఫుటేజ్‌తో కూడిన హార్డ్ డిస్క్‌ను 24 ఫ్రేమ్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, హైదరాబాద్‌కు కొరియర్ చేశారు. ఈ హార్డ్ డిస్క్ మే 25న ఆఫీస్‌కు చేరగా, రఘు అనే ఆఫీస్ బాయ్ అందుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ హార్డ్ డిస్క్‌ను అతను అదే ఆఫీస్‌లో పనిచేసే మహిళకు ఇచ్చి, ఆ తర్వాత ఆ ఇద్దరూ అదృశ్యమయ్యారట.

ఈ వ్యవహారం వెనక కుట్ర ఉందని, సినిమా విడుదలను అడ్డుకునే ఉద్దేశంతో హార్డ్ డిస్క్‌ను దొంగిలించారని విజయ్ కుమార్ ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరా ఫుటేజ్‌ ఆధారంగా రఘు, ఆ మహిళ కదలికలపై విచారణ చేపట్టారు. ఈ ఘటన వల్ల ‘కన్నప్ప’ మూవీ విడుదలపై అనిశ్చితి ఏర్పడే అవకాశముంది. అయితే నిర్మాతల బృందం సమస్యను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Kannappa
  • Kannappa Hard Drive
  • Kannappa Hard Drive missing
  • Kannappa Release
  • manchu vishnu

Related News

    Latest News

    • సినిమా టికెట్ల పెంపుపై హైకోర్టు ఆగ్రహం

    • హిందీ మార్కెట్‌లోకి ఆది సాయికుమార్.. శంబాల హిట్ అవుతుందా?!

    • రోహిత్ శ‌ర్మ‌పై ప్ర‌శంస‌లు కురిపించిన ఐసీసీ చైర్మ‌న్‌!

    • టీటీడీ బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి గుడ్ బై..

    • సంక్రాంతి పండుగ‌ను 4 రోజులు ఎక్క‌డ జ‌రుపుకుంటారో తెలుసా?!

    Trending News

      • బడ్జెట్ 2026.. సామాన్యులకు కలిగే ప్ర‌యోజ‌నాలీవే!

      • బ్రిటన్‌లో ‘X’ నిలుపుదల ముప్పు.. వివాదానికి కారణం ఏంటి?

      • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

      • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

      • మీ మొబైల్ నంబర్ చివర సున్నా ఉందా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd