Daali Dhananjaya : పెళ్లి చేసుకోబోతున్న పుష్ప విలన్.. కాబోయే భార్యతో ఫోటోలు షేర్ చేసి..
తాజాగా దీపావళి సందర్భంగా, అలాగే కర్ణాటక రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ధనుంజయ తనకు కాబోయే భార్యను పరిచయం చేసాడు.
- By News Desk Published Date - 09:13 AM, Sat - 2 November 24
Daali Dhananjaya : కన్నడ స్టార్ డాలి ధనుంజయ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. ధనుంజయ హీరోగా, విలన్ గా, కీ రోల్స్ తో కన్నడలో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. తెలుగులో పుష్ప సినిమాలో జాలి రెడ్డి పాత్రలో కనిపించి నెగిటివ్ రోల్ లో అదరగొట్టాడు. ప్రస్తుతం తెలుగు, కన్నడలో పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు ధనుంజయ.
తాజాగా దీపావళి సందర్భంగా, అలాగే కర్ణాటక రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ధనుంజయ తనకు కాబోయే భార్యను పరిచయం చేసాడు. తనకు కాబోయే భార్యతో దిగిన పలు ఫొటోలను షేర్ చేసి.. నేను ఇష్టపడిన అమ్మాయిని మా ఫ్యామిలీల సపోర్ట్ తో త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాను అని తెలిపారు. అలాగే తన భార్యపేరు ధన్యత గురక్లర్ అని తెలిపాడు. ఆమె గైనకాలిజిస్టుగా పనిచేస్తుంది.
మొత్తానికి కన్నడ నటుడు ధనుంజయ త్వరలో డాక్టర్ ని పెళ్లి చేసుకోబోతున్నాడు. ధనుంజయ ఈ విషయం ప్రకటించడంతో అభిమానులు, పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే వీరిద్దరికి నిశ్చితార్థం కూడా అయిపోయిందని సమాచారం. ఫొటోలతో పాటు ఓ స్పెషల్ వీడియో కూడా షేర్ చేసాడు ధనుంజయ.
Also Read : Deepika – Ranveer : కూతురు పేరు ప్రకటించిన దీపికా పదుకోన్ సింగ్.. పేరు వెరైటీగా ఉందే..