Kangana Ranaut : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన ‘కంగనా’
Kangana Ranaut : ఇటీవల ఆమె నటించిన ఎమర్జెన్సీ సినిమా ఆశించిన విజయం సాధించలేకపోవడంతో.. ఇప్పుడు తన రూట్ ను మార్చుకుంది
- Author : Sudheer
Date : 05-02-2025 - 6:32 IST
Published By : Hashtagu Telugu Desk
లేడీ ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న కంగనా రనౌత్ (Kangana Ranaut Turns Restaurateur) తాజాగా బిజినెస్ రంగంలోకి దిగింది. నటనలో తన ప్రత్యేకతను నిరూపించుకున్న ఈ స్టార్ హీరోయిన్, ఇప్పుడు బిజినెస్ రంగంలో రాణించేందుకు సిద్ధమైంది. ఎప్పుడూ కాంట్రవర్సీలతో వార్తల్లో నిలిచే కంగనా.. తన వ్యాపార ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియాలో ప్రకటించారు. ఇటీవల ఆమె నటించిన ఎమర్జెన్సీ సినిమా ఆశించిన విజయం సాధించలేకపోవడంతో.. ఇప్పుడు తన రూట్ ను మార్చుకుంది. ఇందిరా గాంధీ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి ఆమె దర్శకత్వం వహించడం విశేషం. అయితే చిత్రం విడుదలకు ముందే అనేక వివాదాలు ఎదుర్కొనడంతో పాటు, విడుదలైన తర్వాత మిశ్రమ స్పందన రావడంతో కంగనా సినిమాలు వదిలేసి వ్యాపారంలో రాణించాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది.
ఫిబ్రవరి 14న కంగనా తన కొత్త ఫుడ్ కేఫ్‌ను ప్రారభించబోతుంది. ‘ది మౌంటైన్ స్టోరీ’ పేరుతో హిమాలయాల్లో ఈ కేఫ్‌ను ఏర్పాటు చేసింది. హిమాచల్ ప్రదేశ్ సాంప్రదాయ వంటకాలను ఆధునిక అభిరుచులకు అనుగుణంగా అందించడమే దీని ముఖ్య ఉద్దేశ్యమని కంగనా తెలిపారు. ఈ కేఫ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, తన చిన్ననాటి కల నిజమైందని ఆమె పేర్కొన్నారు. “నా చిన్ననాటి కల ఇప్పుడు సాకారం అయింది. హిమాలయాల ఒడిలో చిన్న కేఫ్ ప్రారంభించాలన్న నా కల నెరవేరింది” అంటూ కంగనా భావోద్వేగంగా స్పందించారు. ఇప్పటి వరకు పలువురు సినీ తారలు ఫుడ్ బిజినెస్‌లో అదృష్టాన్ని పరీక్షించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ జాబితాలో కంగనా కూడా చేరారు. మరి కంగనా రనౌత్ నటన, రాజకీయాల తర్వాత వ్యాపార రంగంలోనూ తనదైన ముద్ర వేస్తారో లేదో చూడాలి.
A childhood dream comes alive.
My little cafe in the lap of Himalayas.
Important announcement coming at 10am. pic.twitter.com/GW4d2BKDPj— Kangana Ranaut (@KanganaTeam) February 5, 2025