Pregnancy Rumors : మాతృత్వం అద్భుతమైన అనుభూతి.. ప్రెగ్నెన్సీపై కాజల్ రియాక్షన్!
టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లుని గత ఏడాది పెళ్లి చేసుకునే విషయం అందరికీ తెలిసిందే. అయితే పెళ్లి తర్వాత కాజల్ పై రకరకాల గాసిప్స్ వినిపిస్తున్నాయి.
- By Balu J Published Date - 12:26 PM, Tue - 9 November 21

టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లుని గత ఏడాది పెళ్లి చేసుకునే విషయం అందరికీ తెలిసిందే. అయితే పెళ్లి తర్వాత కాజల్ పై రకరకాల గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఆమె ప్రస్తుతం ప్రెగ్నెంట్ అని, అందుకే కొత్త సినిమాలు ఒప్పుకోవడం లేదని లాంటి వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇదే విషయమై కాజల్ మాట్లాడుతూ “నేను దాని గురించి ఇప్పుడే మాట్లాడటానికి ఇష్టపడటం లేదు. సరైన సమయం వచ్చినప్పుడు కచ్చితంగా దాని గురించి మాట్లాడతాను’’ అని స్టేట్ మెంట్ ఇచ్చింది. కాగా తన సోదరి నిషా తల్లి కావడాన్ని చూసి మాతృత్వంపై తనకున్న అనేక భావాల గురించి కూడా చెప్పింది.
మాతృత్వం గురించి కాజల్ మాట్లాడుతూ “ఇది నన్ను ఉత్తేజపరుస్తుంది, కానీ అదే సమయంలో, అది నన్ను కూడా భయపెడుతుంది. పెళ్లి తర్వాత చెల్లి జీవితం ఎలా మారిపోయిందో, ఇప్పుడు ఆమె సంపూర్ణంగా ఉందో నేను చూశాను. మాతృత్వం ఒక అద్భుతమైన అనుభూతి అని నేను అనుకుంటున్నాను. నా ఇద్దరు మేనల్లుళ్లు ఇషాన్, కబీర్‌ల సహవాసంలో ఇప్పటికే తల్లిలా భావిస్తున్నా. “ఈ పిల్లలు నా జీవితంలోకి ఎప్పుడైతే ప్రవేశించారో.. కొత్త విషయాలు తెలుసుకున్నా. జీవితం పట్ల ఓ క్లారిటీ వచ్చింది. నాకు నా స్వంత బిడ్డ ఉన్నప్పుడు, ఆ ఎమోషన్ వేరేగా ఉంటుందని అని నేను అనుకుంటున్నా’’ అని చెప్పింది.
కాజల్ తన రాబోయే చిత్రం ఉమా గురించి కూడా మాట్లాడింది, ఇందులో ఆమె సీక్రెట్ గర్ల్ గా నటిస్తోంది, ఆమె ఎక్కడి నుంచో వచ్చి ప్రజలకు తెలియకుండా ఎక్కడికో వెళ్లిపోతుంది. ఇదొక ఫీల్ గుడ్ హ్యాపీ ఫ్యామిలీ డ్రామా. కథ చాలా భిన్నంగా ఉంటుంది.
Related News

Salaar Release Date: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. సలార్ మూవీ కొత్త రిలీజ్ డేట్ ఇదే..!
సలార్ మూవీ ని రానున్న డిసెంబర్ 22న ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు (Salaar Release Date) మేకర్స్ సిద్ధం అయినట్లు సోషల్ మీడియాలో సమాచారం అందుతుంది.